News June 27, 2024
బురద రాజకీయాల్ని పక్కనపెట్టి హామీలు అమలు చేయండి: YCP
AP: YS జగన్‌పై మాజీ సీఎస్ LV చేసిన ఆరోపణల వీడియోను పోస్టు చేసిన <<13518603>>TDPకి<<>> వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ‘రాజధాని పేరుతో వేల ఎకరాలు కొట్టేసి గ్రాఫిక్స్ చూపించే సంస్కృతి మీది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను మొదటి నుంచి జగన్ వ్యతిరేకిస్తున్నారు. LV చేత ఈ మాటలు ఎవరు మాట్లాడిస్తున్నారో అందరికీ తెలుసు. మీ బురద రాజకీయాల్ని పక్కనపెట్టి హామీల అమలుపై దృష్టిపెట్టండి’ అని Xలో రాసుకొచ్చింది.
Similar News
News December 30, 2024
మన్మోహన్ అస్థికల నిమజ్జనం.. విమర్శలపై స్పందించిన కాంగ్రెస్
మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యుల వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తూ ఆయన అస్థికలను యమునా నదిలో కలిపే కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొనలేదని కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. అంత్యక్రియల అనంతరం మన్మోహన్ కుటుంబాన్ని వారి నివాసంలో సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ కలిసి పరామర్శించారని తెలిపింది. అస్థికలు నదిలో కలిపే విషయమై వారితో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కాంగ్రెస్ వెల్లడించింది.
News December 30, 2024
స్పేస్ డాకింగ్: నాలుగో దేశంగా భారత్
ISRO చేపడుతోన్న ‘స్పేడెక్స్ మిషన్’ సక్సెస్ అయితే ప్రపంచంలో స్పేస్ డాకింగ్ సాంకేతికత కలిగి ఉన్న నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది. ఈ టెక్నాలజీ విషయంలో US, రష్యా, చైనా ముందంజలో ఉన్నాయి. చంద్రయాన్-4, ఇండియన్ స్పేస్ సెంటర్ వంటి భవిష్యత్తు ప్రాజెక్టుల్లో ఈ డాకింగ్ టెక్నాలజీ కీలకంగా వ్యవహరిస్తుందని కేంద్ర మంత్రి డా.జితేంద్ర సింగ్ తెలిపారు.
News December 30, 2024
ఒక్క సిగరెట్ తాగితే ఎంత జీవితం నష్టపోతారో తెలుసా?
ఒక సిగరెట్ తాగడం వల్ల పురుషులు 17 నిమిషాలు, మహిళలు 22 నిమిషాల జీవితాన్ని కోల్పోతున్నారని ఓ అధ్యయనం అంచనా వేసింది. యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు దీనిపై అధ్యయనం చేశారు. ధూమపానం వల్ల ఎన్నేళ్ల జీవితాన్ని కోల్పోతారో, అన్నే ఏళ్లపాటు ఆరోగ్యంగా జీవించే కాలాన్ని కూడా కోల్పోతారని పరిశోధకులు పేర్కొన్నారు. జీవితం చివర్లో కంటే ఆరోగ్యవంతమైన మధ్య వయస్సును హరిస్తుందని వివరించారు.