News June 27, 2024

NGKL: పెరిగిన పులుల సంచారం

image

కొల్లాపూర్ రేంజ్ పరిధిలో అడవి పచ్చదనం పెరగడంతో పులుల సంచారం పెరిగింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ పరిధిలో 40కి పైగా పెద్దపులుల సంచారం ఉండగా, కొల్లాపూర్ నల్లమల అటవీప్రాంతంలోనే 13 నుంచి 16దాకా సంచరిస్తున్నాయి. AP నుంచి TG సరిహద్దులోని అడవి ప్రాంతాల్లో పులులు వస్తున్నాయని, పులుల సంచారం పెరగడంతో అందుకు తగ్గుట్టుగా వసతులు కల్పిస్తున్నామని కొల్లాపూర్ రేంజి అధికారి శరత్ చంద్రరెడ్డి పేర్కొన్నారు.

Similar News

News December 21, 2024

కొడంగల్‌ను అభివృద్ధి చేస్తుంటే కుట్రలు: సీఎం రేవంత్

image

బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. వెనుకబడిన t
కొడంగల్‌ను అభివృద్ధి చేస్తుంటే కుట్రలు చేసి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లగచర్లలో దాడులు చేయించారన్నారు. స్థానికులను రెచ్చగొట్టి అధికారులపై ఉసిగొల్పారని మండిపడ్డారు. అధికారులు ఏం పాపం చేశారని వారిపై దాడులు చేశారని బీఆర్ఎస్ నాయకులను ఆయన ప్రశ్నించారు.

News December 21, 2024

MBNR: చెరువులో పడి తల్లి, ఇద్దరు పిల్లల మృతి

image

మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలో పోమాల్‌లో శనివారం విషాదం చోటుచేసుకుంది. పోమాల్ గ్రామానికి ఓ తల్లి, ఇద్దరు పిల్లలు చెరువులో పడి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 21, 2024

కార్పొరేషన్‌గా మహబూబ్‌నగర్

image

మహబూబ్‌నగర్ పట్టణం ఇక అప్‌గ్రేడ్ కానుంది. పట్టణాన్ని మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ చేస్తన్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు అసెంబ్లీలో ప్రకటించారు. ప్రస్తుతం పట్టణంలో 49 వార్డుల్లో 2.88 లక్షల జనాభా ఉంది. కొత్తగా కార్పొరేషన్ ఏర్పడేందుకు 3 లక్షల జనాభా అవసరం కానుండటంతో శివారులోని జైనల్లీపూర్, దివిటిపల్లి గ్రామాలు విలీనం కానున్నాయి. ఇదిలా ఉండగా మద్దూరు, దేవరకద్ర పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారనున్నాయి.