News June 27, 2024

శ్రీకాకుళం: ప్రత్యేక రైళ్లను పొడిగించిన రైల్వే అధికారులు

image

ప్రయాణికుల రద్దీ మేరకు శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా న్యూ టిన్‌సుఖియా(NTSK), SMVT బెంగుళూరు(SMVB) మధ్య నడిచే స్పెషల్ రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.05952 NTSK- SMVB రైలును జూలై 4 నుంచి అక్టోబర్ 10 వరకు ప్రతి మంగళవారం, నం.05951 SMVB- NTSK రైలును జూలై 8 నుంచి నవంబర్ 4 వరకు ప్రతి సోమవారం నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.

Similar News

News July 3, 2024

శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ నేపథ్యం

image

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. 2016 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఈయన ప్రారంభంలో నూజివీడు ఆర్టీవోగా, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌గా పని చేశారు. మంచి పని తీరుతో ప్రజల ప్రశంసలు పొందారు. ముక్కుసూటిగా వ్యవహరిస్తూ పనుల విషయంలో అధికారులు, సిబ్బందిని పరుగులు పెట్టించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌గా 2022 ఏప్రిల్‌లో బాధ్యతలు స్వీకరించారు.

News July 3, 2024

శ్రీకాకుళం: శుభకార్యానికి వెళ్తుండగా హత్య

image

పొందూరు మండలం చిన్న బొడ్డేపల్లికి చెందిన రాజేశ్వరి(30) హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే
మంగళవారం సంతకవిటి మండలం వాల్తేరులో శుభకార్యానికి ఇద్దరు ఆటోలో బయలుదేరారు. ఆటోలో వాల్తేరు వెళ్తుండగా తాడివలస సమీపంలో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. గోపాల్‌ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె మెడపై పలుమార్లు దాడి చేయగా.. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 3, 2024

హత్రస్ బాధితులకు మంత్రి రామ్మోహన్ సానుభూతి

image

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హత్రస్ తొక్కిసలాట బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు. మంగళవారం యూపీలోని హత్రస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో 116 మంది చనిపోవడం, పలువురు గాయపడటం బాధాకరమని రామ్మోహన్ Xలో పోస్ట్ చేశారు.