News June 27, 2024
ప్రతి రంగంలోనూ రామోజీ నం.1గా ఎదిగారు: CBN

AP: ఎంచుకున్న ప్రతి రంగంలోనూ రామోజీరావు నంబర్ 1గా ఎదిగారని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో నిర్వహించిన సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్, రామోజీని ఎవరూ అధిగమించలేరని చెప్పారు. ఆయనో అక్షర శిఖరమని, నీతి నిజాయితీకి ప్రతిరూపమని కొనియాడారు. ప్రజాహితమే లక్ష్యంగా ఆయన పనిచేశారని పేర్కొన్నారు. రామోజీ స్ఫూర్తిని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.
Similar News
News January 9, 2026
గర్భాశయ రక్తస్రావం గురించి తెలుసా?

మారుతున్న జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, వయస్సుతో పాటు అనేక గర్భాశయ సంబంధిత సమస్యలు స్త్రీలను ఇబ్బంది పెడుతున్నాయి. వాటిల్లో ఒకటే గర్భాశయ రక్తస్రావం. పీరియడ్స్‌లో అధిక రక్తస్రావం, పీరియడ్స్ మధ్య స్పాటింగ్, సంభోగం తర్వాత రక్తస్రావం ఉన్నా గర్భాశయ రక్తస్రావం అంటారు. ఇది ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, PCOS, థైరాయిడ్ వల్ల వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
News January 9, 2026
శుక్రవారం ఈ పనులు చేస్తున్నారా?

లక్ష్మీదేవికి ప్రీతికరమైన శుక్రవారం రోజున చేసే కొన్ని పనులు దారిద్ర్యానికి దారితీస్తాయని పండితులు చెబుతున్నారు. ‘దేవుడి పటాలు శుభ్రం చేయకూడదు. పాత విగ్రహాలు బయట పడేయకూడదు. అప్పు ఇవ్వడం, తీసుకోవడం చేయవద్దు. జుట్టు, గోళ్లు కత్తిరించకూడదు. ఇంటిని శుభ్రంగా ఉంచితే లక్ష్మీ కటాక్షంతో సిరి సంపదలు కలుగుతాయి’ అని సూచిస్తున్నారు. కుబేర యోగం కలగాలంటే ఏం చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
News January 9, 2026
కొత్త బీడీ పొగాకు రకం ‘ABD 132’.. దీని ప్రత్యేకత ఏమిటి?

ABD 132 బీడీ పొగాకు రకాన్ని నంద్యాల ప్రాంతీయ పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసింది. ఈ రకం పంటకాలం 195 నుంచి 210 రోజులుగా ఉంటుంది. ఖరీఫ్‌లో వర్షాధారంగా సాగు చేయడానికి ఈ రకం అనుకూలమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇతర బీడీ పోగాకు రకాలతో పోలిస్తే దీని పొగలో హానికర అంశాలు తక్కువగా ఉంటాయని చెప్పారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఇటీవల దీన్ని విడుదల చేశారు.


