News June 27, 2024

AP- IIITలకు ఎంతమంది అప్లై చేశారో తెలుసా?

image

AP- RGUKT పరిధిలోని 4 IIITల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి గత నెల 8న ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ 25వ తేదీకి ముగిసింది. ఈఏడాది 4,400 ప్రవేశాలకు గాను 53,863 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. జులై 11న ఎంపికైన అభ్యర్థుల
జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపారు. జులై 22, 23న నూజివీడు, ఇడుపులపాయ,
24, 25న ఒంగోలు, 26, 27న శ్రీకాకుళం IIIT అభ్యర్థులకు కౌన్సెలింగ్ జరగనుంది.

Similar News

News October 7, 2024

కడప – చెన్నై జాతీయ రహదారిపై తప్పిన ఘోర ప్రమాదం

image

పుల్లంపేట మండలం జాగువారి పల్లి వద్ద కడప – చెన్నై జాతీయ రహదారిపై సోమవారం ఉదయం కారు – లారీ ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న సింహాద్రిపురం, చింతకొమ్మదిన్నె ఎస్సైల భార్యలకు స్వల్ప గాయాలయ్యాయి. మరో లారీ డీజిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టడంతో సుమారు 600 లీటర్లు డీజిల్ రోడ్డుపై పడింది. పొరపాటున మంటలు చెలరేగి ఉంటే ఘోర ప్రమాదమే జరిగి ఉండేది. ఘటన స్థలానికి పుల్లంపేట పోలీసులు చేరుకొని పరిశీలిస్తున్నారు.

News October 6, 2024

దువ్వూరు: శవమై తేలిన తప్పిపోయిన రెండేళ్ల బాలుడు

image

దువ్వూరుకు చెందిన తంగేడు పల్లె సాయికుమార్ కుమారుడు అమర్(2) ఈనెల 3న ఇంటి వద్ద ఆడుకుంటూ తప్పిపోయాడు. ఆ సమయంలో బాలుడి ఆచూకి కోసం తల్లిదండ్రులు దువ్వూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల తర్వాత బాలుడు కేసి కాలువలో శవమై తేలాడు. బాలుడు మృతిపై పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 6, 2024

కడప నగరంలో కారు బోల్తా

image

బిజీగా ఉండే కడప నగరంలోని అప్సర సర్కిల్ వద్ద కారు బోల్తా పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వేగంగా వచ్చిన ఓ కారు అప్సర సర్కిల్ వద్ద బోల్తా పడింది. విషయం తెలుసుకున్న చిన్న చౌక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫల్టీ కొట్టిన కారును పరిశీలిస్తున్నారు. ఎంతమందికి గాయాలయ్యాయనే విషయాలు తెలియాల్సిఉంది.