News June 27, 2024

కవిటి: కేరళలో కరాపాడు వలస కూలీ మృతి

image

కవిటి మండలం జి.కరాపాడ గ్రామానికి చెందిన నర్తు కాళీప్రసాద్ మృతి చెందారు. మృతుడు 4 రోజుల క్రితం కేరళ రాష్ట్రానికి వలస కూలీగా వెళ్లి గురువారం ఉదయం తాను పనిచేస్తున్న చోట పైనుంచి జారిపడి తలకు బలమైన గాయమవ్వడంతో మృతి చెందినట్లుగా బంధువులు తెలిపారు. కాళీప్రసాద్‌కు ఇటీవలే పెళ్లి నిశ్చయమైందని, ఇంతలోనే ఇలా జరిగే సరికి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Similar News

News July 3, 2024

బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

పలాస మీదుగా సత్రాగచ్చి(SRC), SMVT బెంగళూరు(SMVB) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల సౌలభ్యం మేరకు కొద్దిరోజులు పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.08845 SRC- SMVB ట్రైన్‌ను జులై 5 నుంచి 26 వరకు ప్రతి శుక్రవారం, నం.08846 SMVB- SRC ట్రైన్‌ను జులై 7 నుంచి 28 వరకు ప్రతి ఆదివారం నడుపుతామని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఈ ట్రైన్లు ఏపీలో విజయనగరం,విజయవాడ తదితర స్టేషన్లలో ఆగుతాయి.

News July 3, 2024

శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ నేపథ్యం

image

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. 2016 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఈయన ప్రారంభంలో నూజివీడు ఆర్టీవోగా, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌గా పని చేశారు. మంచి పని తీరుతో ప్రజల ప్రశంసలు పొందారు. ముక్కుసూటిగా వ్యవహరిస్తూ పనుల విషయంలో అధికారులు, సిబ్బందిని పరుగులు పెట్టించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌గా 2022 ఏప్రిల్‌లో బాధ్యతలు స్వీకరించారు.

News July 3, 2024

శ్రీకాకుళం: శుభకార్యానికి వెళ్తుండగా హత్య

image

పొందూరు మండలం చిన్న బొడ్డేపల్లికి చెందిన రాజేశ్వరి(30) హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే
మంగళవారం సంతకవిటి మండలం వాల్తేరులో శుభకార్యానికి ఇద్దరు ఆటోలో బయలుదేరారు. ఆటోలో వాల్తేరు వెళ్తుండగా తాడివలస సమీపంలో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. గోపాల్‌ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె మెడపై పలుమార్లు దాడి చేయగా.. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.