News June 27, 2024
‘కల్కి’కి తొలిరోజే రూ.200 కోట్ల కలెక్షన్స్?

ప్రభాస్ నటించిన కల్కి 2898AD సినిమా <<13517562>>పాజిటివ్<<>> టాక్‌తో దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి తొలిరోజే రూ.200 కోట్ల కలెక్షన్లను సాధించే అవకాశం ఉందని నేషనల్ మీడియా వెల్లడించింది. ముందస్తు బుకింగ్‌ల ఆధారంగా ఈ అంచనా వేసింది. మొదటి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ చిత్రంగా రికార్డు సృష్టించనుందని పేర్కొంది. తొలివారంలోనే రూ.500 కోట్లను కొల్లగొట్టే అవకాశం ఉందని తెలిపింది.
Similar News
News November 11, 2025
హజ్ యాత్రికులకు రూ.లక్ష సాయం: సీఎం చంద్రబాబు

AP: వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. విజయవాడలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ హజ్ యాత్రికులకు రూ.లక్ష చొప్పున సాయం చేస్తామని ప్రకటించారు. కడప, విజయవాడలో హజ్ భవనాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మైనారిటీల అభివృద్ధికి అండగా ఉంటామన్నారు.
News November 11, 2025
స్థిరాస్తి అమ్మకం సేవా పన్ను పరిధిలోకి రాదు: SC

స్థిరాస్తి అమ్మకాలు సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి రావని SC స్పష్టం చేసింది. సహారా కంపెనీకి ‘ఎలిగెంట్ డెవలపర్స్’ 2002-05లో గుజరాత్, హరియాణా, MHలోని తన భూములను అవుట్‌రైట్ సేల్ చేసింది. అయితే ‘రియల్ ఏజెంటు’గా అమ్మినందున ₹10.28CR సర్వీస్ ట్యాక్స్ కట్టాలని DGCEI నోటీసులు ఇచ్చింది. వీటిని సంస్థ సవాల్ చేయగా CESTAT రద్దుచేసింది. దీనిపై సర్వీస్ ట్యాక్స్ కమిషనర్ దాఖలు చేసిన పిటిషన్‌పై SC తాజా తీర్పు ఇచ్చింది.
News November 11, 2025
ఇంజినీర్ పోస్టులకు RITES నోటిఫికేషన్

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్( <


