News June 27, 2024

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత ఉండొద్దు: మంత్రి రాజనర్సింహ

image

TG: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదవారికి మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఎక్కడా సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని DMHOలను ఆదేశించారు. ప్రతి 30KM పరిధిలో PHC ఉండాలన్నారు. జిల్లా, ఏరియా, PHCల అనుసంధానంపై దృష్టిసారించాలని సూచించారు. నిబంధనలు పాటించని ప్రైవేటు ఆస్పత్రుల లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.

Similar News

News October 11, 2024

తుఫాను ముప్పు.. మూడు రోజులు భారీ వర్షాలు

image

AP: రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రెండు, మూడు రోజుల్లో వాయుగుండంగా బలపడుతుందని పేర్కొంది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

News October 11, 2024

మద్యం దుకాణాల దరఖాస్తులకు నేడే ఆఖరు

image

AP: రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. నిన్న రాత్రి వరకు 65,629 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి రూ.1,300 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఇవాళ మరో 20వేల వరకు అప్లికేషన్లు వస్తాయని భావిస్తున్నారు. రాష్ట్రంలో 12 చోట్ల షాపులకు ఒక్కోటి చొప్పున, 46 దుకాణాలకు రెండేసి దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.

News October 11, 2024

రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి

image

AP: ఈ నెల 17న వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని అధికారులను మంత్రి సవిత ఆదేశించారు. రాష్ట్ర స్థాయి వేడుకను అనంతపురంలో నిర్వహిస్తామని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ మేరకు కలెక్టర్లు ఆయా జిల్లాల్లో అధికారులకు ఆదేశాలివ్వాలన్నారు.