News June 28, 2024

ఇరిగేషన్ అంశాలపై మంత్రి నిమ్మల చర్చ

image

గుంటూరు జిల్లా వెలగపూడి సచివాలయంలో ఇరిగేషన్ అంశాలపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర ఆర్థిక మంత్రి పి.కేశవ్‌తో కలిసి గురువారం చర్చించారు. ఈ వారంలో ప్రపంచ బ్యాంకు బృందం పోలవరం పర్యటన, నిర్వాసితుల సమస్యల నేపథ్యంలో చర్చలు సాగాయి. చర్చల్లో జలవనరుల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, జలవనరుల శాఖ సలహాదారులు వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజినీర్ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News March 1, 2026

ప.గో: డబ్బులు కొట్టేసేందుకు వచ్చిన ఫోన్ కాల్ ఇది..!

image

సైబర్ క్రైమ్ మోసగాళ్లు రోజుకో పంథా అనుసరిస్తున్నారు. బురిడీ కొట్టించే ప్రయత్నంలో బెడిసి కొట్టిన ఉదంతం ఆకివీడు మండలంలో వెలుగు చూసింది. అజ్జమూరుకి చెందిన రిటైర్డ్ టీచర్‌కు నిన్న ఉదయం గుర్తు తెలియని నెంబర్ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. బ్యాంక్‌కి సంబంధించి పత్రాలపై ష్యూరిటీ పెట్టిన సంగతి గుర్తులేదా అంటూ అతడ్ని భయపెట్టారు. ఆయన ధైర్యంగా ఎదుర్కొనే సరికి తోక ముడిచాడు. మళ్ళీ ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు.

News March 1, 2026

భీమవరం: కలెక్టర్ ఇచ్చిన ఫ్రీజర్లు.. 2 రోజులకే ధ్వంసం

image

గత నెలలో భీమవరం ఆస్పత్రిలో ఫ్రీజర్‌ మరమ్మతులకు గురై ఓ మృతదేహాన్ని రాత్రంతా అలాగే ఉంచిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై కలెక్టర్ స్పందించి రూ.2,60,000 నిధులతో 2 కొత్త ఫ్రీజర్లను ఆస్పత్రికి అందించారు. అయితే 2 రోజులకే దుండగులు వాటిలోని కాపర్ వైర్లను కట్ చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సూపరింటెండెంట్ తెలిపారు. అయితే వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందనే ఆరోపణలున్నాయి.

News March 1, 2026

నరసాపురం: పెద్ద మనిషిలా వచ్చి.. బాలికపై లైంగిక వేధింపులు

image

నరసాపురం పట్టణానికి చెందిన మైనర్ బాలిక కుటుంబ వివాదాలను చక్కదిద్దుతామని పెద్ద మనిషిలా వచ్చి, బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలికి రావాల్సిన నగదు విషయంలో నిందితుడు కాకిలేటి ఆనంద్ కుమార్ ఆమెను వేధిస్తూ, అసభ్యంగా ప్రవర్తించేవాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ముత్యాలరావు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.