News June 28, 2024
జుక్కల్: ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యూత్ నాయకులు నల్లబట్టలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జుక్కల్ అసెంబ్లీ యూత్ అధ్యక్షుడు ఇమ్రోజ్ మాట్లాడుతూ.. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావ్ ఆదేశాల మేరకు నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. నిరసన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి విజయ్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
Similar News
News January 6, 2026
జక్రాన్‌పల్లి: ఉరేసుకొని వృద్ధురాలు ఆత్మహత్య

అనారోగ్య సమస్యలతో ఇంట్లో ఉరేసుకొని ఓ వృద్ధురాలు బలవన్మరణం చెందినట్లు జక్రాన్ పల్లి ఎస్సై మహేశ్ తెలిపారు. మునిపల్లికి చెందిన ఆరే గంగు(85) గత కొన్ని రోజుల క్రితం ఇంట్లో కాలుజారి కింద పడగా తుంటి ఎముక పెరిగింది. దీంతో మనస్థాపానికి గురైన వృద్ధురాలు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై చెప్పారు.
News January 6, 2026
NZB: పాముకాటుతో వ్యక్తి మృతి.. కేసు నమోదు

మోపాల్ మండలం శివలాల్ తండాలో పాముకాటుతో ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై సుశ్మిత తెలిపారు. గత సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన కేతావత్ రామచందర్(43)కు పొలంలో పనిచేస్తుండగా పాము కరిచింది. దీంతో అతన్ని NZBలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స సమయంలో కోమాలోకి వెళ్లడు. అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స అనంతరం ఇంటికి తీసుకొచ్చారు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో మృతి చెందాడు.
News January 5, 2026
నిజామాబాద్: సంక్రాంతి ప్రయాణమా.. జాగ్రత్తలు తప్పనిసరి!

సంక్రాంతి సెలవులకు వెళ్లే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. నగలు, విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో ఉంచాలని, ఇంటికి బలమైన సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వాడాలని చెప్పారు. ప్రయాణ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దన్నారు. సీసీ కెమెరాల ద్వారా ఇంటిని పర్యవేక్షించాలన్నారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే ‘డయల్ 100’కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ కోరారు.


