News June 28, 2024
T20WC: రోహిత్ శర్మ ఎమోషనల్!

టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన ఆనందంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యారు. డగౌట్‌లో కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నారు. సహచర ఆటగాళ్లు ఆయనను ఓదారుస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా రోహిత్ ఐసీసీ టోర్నమెంట్లలో 27 మ్యాచ్‌లకు సారథ్యం వహించారు. అందులో 24 మ్యాచుల్లో జట్టును గెలిపించారు. 4 మ్యాచుల్లో ఓటమిపాలయ్యారు. విన్నింగ్ పర్సంటేజీ 81.47%గా ఉంది.
Similar News
News January 26, 2026
భారతీయత ఉట్టిపడేలా ఉర్సులా జాకెట్

భారత సంప్రదాయం ఉట్టిపడేలా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాధారణంగా ప్యాంటుసూట్స్‌లో కనిపించే ఆమె తాజాగా బనారసీ జాకెట్‌ను ధరించారు. గోల్డ్, మెరూన్ రంగులో ఉన్న ఈ దుస్తులు ఆకట్టుకుంటున్నాయి. 77వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఉర్సులా హాజరయ్యారు. ఈ వేడుకల్లో పాల్గొనడం తన జీవితంలో లభించిన అతిపెద్ద గౌరవం అని ట్వీట్ చేశారు.
News January 26, 2026
మాజీ ప్రియుడి భార్యకు HIV ఇంజెక్షన్..! ఆమె సేఫేనా?

AP: కర్నూలులో ఈనెల 9న నర్సు HIV ఇంజెక్షన్ ఇచ్చిన లేడీ డాక్టర్‌కు వైరస్ సోకే అవకాశం లేదని వైద్య నిపుణులు తెలిపారు. వసుంధర గతనెల 28న వైరస్ బ్లడ్ సేకరించి ఫ్రిజ్‌లో ఉంచడంతో అన్ని రోజులు వైరస్ బతకదన్నారు. కానీ రక్త గ్రూప్ తదితరాలతో ముప్పుపై అప్రమత్తత అవసరమని చెప్పారు. వసుంధర ప్రేమించిన డాక్టర్ మరో డాక్టర్‌ను పెళ్లి చేసుకోగా, అతడిని సొంతం చేసుకోవాలని యాక్సిడెంట్ చేయించి ఇంజెక్షన్ ఇవ్వడం తెలిసిందే.
News January 26, 2026
20 నిమిషాలకో ఇండియన్ అరెస్ట్

భవిష్యత్తు ఆశతో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ భారతీయులు అధికంగా పట్టుబడుతున్నారు. ఆ దేశ సరిహద్దుల్లో 2025లో ప్రతి 20 నిమిషాలకో ఇండియన్ అరెస్టయ్యారు. గత ఏడాది 23,830 మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నట్లు US కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ వెల్లడించింది. 2024లో ఈ సంఖ్య 85,119గా ఉంది. గతేడాది వివిధ దేశాలకు చెందిన 3.91L మంది అరెస్టయ్యారు. కెనడా, మెక్సికో సరిహద్దుల్లో ఎక్కువ మంది పట్టుబడుతున్నారు.


