News June 28, 2024

రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచుల్లో హాఫ్ సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్‌గా రోహిత్ నిలిచారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆయన ఈ ఘనత సాధించారు. అలాగే టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక ఫోర్లు బాదిన తొలి ప్లేయర్‌గా హిట్‌మ్యాన్ (113) నిలిచారు. ఈ క్రమంలో ఆయన మహేల జయవర్ధనే (111) రికార్డును అధిగమించారు.

Similar News

News December 31, 2025

విశాఖ: రేషన్ షాపుల్లో రూ.20కే కిలో గోధుమ పిండి!

image

జిల్లాలోని పట్టణ ప్రాంత రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం దృష్ట్యా జనవరి 2, 2026 నుంచి కార్డుకు కిలో చొప్పున గోధుమ పిండిని కేవలం రూ.20లకే పంపిణీ చేయనున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.45 నుంచి రూ.80 వరకు ఉన్న పిండిని సబ్సిడీ ధరకే అందిస్తున్నారు. పోషకాలతో కూడిన ఈ గోధుమ పిండిని లబ్ధిదారులందరూ వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ కోరారు.

News December 31, 2025

మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం.. ఇదే!

image

మార్కాపురంను నూతన జిల్లాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే మార్కాపురం పట్టణంలోని తర్లపాడు రోడ్డులో గల రిహాబిటేషన్ అండ్ రీ సెటిల్మెంట్ కాలనీలో ఉన్న భవనాన్ని కలెక్టర్ కార్యాలయంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యాలయం నుంచి పరిపాలన వ్యవహారాలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం భవనానికి నూతన హంగులనిచ్చారు.