News June 28, 2024

మచిలీపట్నం వైసీపీ కార్యాలయానికి నోటీసులు

image

నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం జరుగుతోందని మచిలీపట్నంలో నిర్మిస్తున్న YCP కార్యాలయానికి బుధవారం నోటీసులిచ్చారు. YCP జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని అందుబాటులో లేకపోవడంతో కొత్త భవనం వద్దకు వెళ్లి అక్కడున్న సిబ్బందికి నోటీసులు ఇచ్చారు. 1000 చదరపు గజాల విస్తీర్ణం దాటిన భవనాలకు మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్లాన్ అప్రూవల్ తీసుకోవాలని, అలా జరగనందునే నోటీసులు ఇచ్చినట్లు అధికారులు చెప్పారు.

Similar News

News September 15, 2025

MTM: ఎస్పీ గంగాధరరావుకు ఘన వీడ్కోలు

image

కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేసి బదిలీపై వెళ్తున్న ఆర్. గంగాధరరావు ఐపీఎస్‌కు పోలీసులు ఘనంగా వీడ్కోలు పలికారు. మచిలీపట్నం గోల్డ్ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఎస్పీతో తమ అనుభవాలను పంచుకున్నారు. తమకు సహకరించిన అధికారులకు, సిబ్బందికి గంగాధరరావు కృతజ్ఞతలు తెలిపారు.

News September 15, 2025

పటమటలో నెట్ బాల్ జట్ల ఎంపికలు

image

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16న పటమట ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో అండర్-14, 17 బాల, బాలికల నెట్ బాల్ జట్ల ఎంపికలు జరగనున్నాయి. ఎంపికలకు హాజరయ్యే క్రీడా కారులు తమ స్టడీ సర్టిఫికెట్, జనన ధృవీకరణ పత్రం, అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయుల సంతకం, సీల్‌తో ఉన్న ఎంట్రీ ఫారం తీసుకురావాలని ఎస్జీఎఫ్ కార్యదర్శులు దుర్గారావు, రాంబాబు తెలిపారు. ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి.

News September 15, 2025

కృష్ణా జిల్లాలో ఇంటి స్థలం కోసం 19,382 దరఖాస్తులు

image

కృష్ణా జిల్లాలో గృహ సముదాయాల కోసం ఇప్పటివరకు 19,382 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా రెవెన్యూ అధికారుల సమాచారం ప్రకారం.. గుడివాడ డివిజన్‌లో 3,364 మంది, మచిలీపట్నం డివిజన్‌లో 6,083 మంది, ఉయ్యూరు డివిజన్‌లో 9,935 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించారు. అయితే, స్థలాల కేటాయింపు, పట్టాల పంపిణీపై స్పష్టత లేకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.