News June 28, 2024
భీమవరం: RTC బస్సు ఢీకొని బీటెక్ స్టూడెంట్ మృతి

భీమవరం మండలం తుందుర్రు గ్రామానికి చెందిన కోయ రాజేంద్రరామ్(20) రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రామ్ భీమవరం నుంచి తుందుర్రు వెళ్తుండగా.. తాడేరు వద్ద ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టడంతో మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మృతుడి తమ్ముడికి తీవ్ర గాయాలు కావడంతో భీమవరంలోని ఆసుపత్రికి తరలించారు. దీనిపై భీమరం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 12, 2025
తణుకు: కూతురి హత్య కేసులో తల్లిదండ్రులు అరెస్ట్

తణుకు మండలం ముద్దాపురంలో మూడేళ్ల కిందట యువతి సజీవ దహనం కేసులో ఆమె తండ్రితో పాటు సవతి తల్లిని బుధవారం తణుకు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ కృష్ణ కుమార్ వివరాల మేరకు.. యువతికి చెందిన ఆస్తి కోసం సవతి తల్లి ముళ్లపూడి రూప, శ్రీనివాసు ఆమెను సజీవదహనం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అప్పట్లో పనిచేసిన పోలీసు అధికారుల పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.
News November 12, 2025
తాళ్లకోడు లేఔట్లో సామూహిక నూతన గృహప్రవేశాలు

ఆకివీడు మండలం కుప్పనపూడి శివారు తాళ్లకోడులోని 74 ఎకరాల లేఔట్లో NTR కాలనీలో సమూహిక నూతన గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. పలువురి లబ్ధిదారులకు నూతన గృహ రుణ పత్రాలు అందించారు. కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట సర్పంచ్ అనురాధ ఉన్నారు.
News November 12, 2025
తణుకు: వీడిన మిస్టరీ.. ఆస్తి కోసం కూతురినే చంపేశారు!

తణుకు(M) ముద్దాపురానికి చెందిన <<18261784>>యువతి సజీవ దహనం<<>> కేసు మిస్టరీ వీడింది. గ్రామానికి చెందిన ముళ్లపూడి నాగ హరితకు తల్లి ద్వారా సంక్రమించిన ఆస్తి కోసం సవతి తల్లి రూప, తండ్రి ముళ్లపూడి శ్రీనివాస్ 2022 NOV 12న హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారు. తాజాగా ఫోరెన్సిక్ రిపోర్టులో హత్యగా నిర్ధారణ కావడంతో ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. మూడేళ్ల క్రితం హత్య జరిగిన సరిగ్గా ఇదే రోజున కేసు మిస్టరీ వీడటం గమనార్హం.


