News June 28, 2024
సెప్టెంబర్ 21 నాటికి అన్న క్యాంటీన్లు: మంత్రి

AP: సెప్టెంబర్ 21 నాటికి రాష్ట్రంలో ప్రతిపాదిత 203 అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి పొంగూరు నారాయణ ఆదేశించారు. క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే సంస్థలను టెండర్ల ద్వారా ఎంపిక చేయాలన్నారు. ఇప్పటికే క్యాంటీన్ల పునరుద్ధరణకై తక్షణం రూ.189.22 కోట్లు అవసరమని అధికారులు ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపారు. ఆమోదం రాగానే సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు.
Similar News
News January 22, 2026
డ్రాగన్ ఫ్రూట్ సాగు.. అనువైన నేలలు, నాటే సమయం

డ్రాగన్ ప్రూట్ పంట ఏ నేలలోనైనా పండుతుంది. అయితే రాళ్ల భూమి, ఎర్ర భూములు ఎక్కువ అనుకూలం. పంటను బెడ్ పద్ధతిలో వేసుకుంటే మంచిది. నవంబర్, డిసెంబర్ నెలల్లో పంటను నాటుకోవడం శ్రేయస్కరం. ఈ నెలల్లో కాయను కత్తిరించిన మొక్క నుంచి కొమ్మను మనం స్వయంగా చూసి తెచ్చుకొని నాటితే అది 6 నుంచి 9 నెలల్లో కాయలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో నాటే మొక్కలు బతికే అవకాశం ఎక్కువ.
News January 22, 2026
నేడు కోటప్పకొండకు పవన్ కళ్యాణ్

AP: నేడు పల్నాడు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉ.10.30 గంటలకు హెలికాప్టర్‌లో కోటప్పకొండకు చేరుకోనున్నారు. ముందుగా త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. మార్గం మధ్యలో ప్రకృతి పర్యావరణ కేంద్రాన్ని సందర్శిస్తారు. తర్వాత కోటప్పకొండ-కొత్తపాలెం మధ్య రూ.3.9 కోట్లతో నిర్మించిన రోడ్డును ప్రారంభిస్తారు. అనంతరం మహాశివరాత్రి ఉత్సవాలపై పవన్ సమీక్ష చేయనున్నారు.
News January 22, 2026
వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్!

బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవులు ఉండనున్నాయి. జనవరి 24 (నాలుగో శనివారం), 25 (ఆదివారం), 26 (గణతంత్ర దినోత్సవం) సెలవులు కాగా 27(మంగళవారం)న సమ్మె జరగనుంది. వారానికి ఐదు పని దినాలు ఉండాలని డిమాండ్ చేస్తూ బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే ఈ రోజుల్లో డిజిటల్, ఏటీఎం సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదు. ఏమైనా బ్యాంక్ పనులుంటే ఇవాళ, రేపు ప్లాన్ చేసుకోవడం మేలు.


