News June 28, 2024

భారత్‌లో ఎప్పుడూ రాజకీయ ఒత్తిళ్లు ఎదుర్కోలేదు: CJI

image

24 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కోలేదని సుప్రీం కోర్టు సీజేఐ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. యూకేలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘భారత్‌లో జడ్జిలు ప్రభుత్వ రాజకీయ ప్రభావం నుంచి దూరంగా ఉంటారు. అయితే, తమ నిర్ణయాలు రాజకీయంగా ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో న్యాయమూర్తులకు అవగాహన ఉండాలి. పాలనాపరమైన కేసుల విచారణ సందర్భంగా దాన్ని గుర్తుపెట్టుకోవాలి’ అని పేర్కొన్నారు.

Similar News

News January 22, 2026

మార్కెట్ విలువ పెంపు.. రియల్ బూమ్, ఆదాయమే టార్గెట్!

image

AP: రియల్ ఎస్టేట్‌ రంగాన్ని ప్రోత్సహించడం, ఆదాయం పెంచుకోవడమే టార్గెట్‌గా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భూముల <<18911969>>మార్కెట్ విలువ<<>> పెంచాలని నిర్ణయించింది. గతేడాది ఫిబ్రవరి 1వ తేదీన పెంచిన విలువతో దాదాపు 9 నెలల్లోనే రూ.7వేల కోట్లు ఆర్జించింది. ఈసారి కూడా అదే స్ట్రాటజీతో ముందుకు సాగుతోంది. 7-8 శాతం వరకు పెంపు ఉండొచ్చని తెలుస్తోంది. ప్రతి సంవత్సరం మార్కెట్ విలువ పెంచే అవకాశం ఉంది.

News January 22, 2026

CCMBలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

CSIR-సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (<>CCMB<<>>) 4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి బీఎస్సీ, పీజీ (నేచురల్ సైన్సెస్, మాలిక్యులర్ బయాలజీ), BE/BTech, MBBS, PhD అర్హతతో పాటు పని అనుభవం గల వారు జనవరి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ccmb.res.in

News January 22, 2026

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోన్న బంగారం, వెండి ధరలు ఇవాళ శాంతించాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.2,290 తగ్గి రూ.1,54,310కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,100 పతనమై రూ.1,41,450 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.5వేలు తగ్గి రూ.3,40,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.