News June 28, 2024
టెన్త్ అర్హతతో 8,326 పోస్టులకు నోటిఫికేషన్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 8,326 పోస్టులు (4,887 MTS+3,439 హవల్దార్) ఉన్నాయి. జులై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. OCT-NOVలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. MTS పోస్టులకు 18-25 ఏళ్లు, హవల్దార్ పోస్టులకు 18-27 ఏళ్ల వయసు ఉండాలి. టెన్త్ పాసైన వారు అర్హులు. పూర్తి వివరాలకు <
Similar News
News April 9, 2026
మరో వివాదంలో ధురంధర్-2!

సునామీ కలెక్షన్లతో దూసుకెళ్తున్న ధురంధర్-2ను <<19529183>>వివాదాలు<<>> వెంటాడుతున్నాయి. ఈ సినిమాలో తమ అనుమతి లేకుండా ‘హమ్ ప్యార్ కర్నే వాలే’ సాంగ్‌ను వాడుకున్నారంటూ త్రిమూర్తి ఫిల్మ్స్ ముంబై కోర్టును ఆశ్రయించింది. 1989లో వచ్చిన ‘త్రిదేవ్’లోని ఆ పాట హక్కులు తమ వద్దే ఉన్నాయని తెలిపింది. ఈ సాంగ్‌ను ‘ధురంధర్’ నుంచి తొలగించాలని, లేదంటే నష్ట పరిహారం చెల్లించాలని కోరింది. త్వరలోనే ఈ పిటిషన్‌పై విచారణ జరగనుంది.
News April 9, 2026
భూమి, చంద్రుడి HD ఫొటోలు

‘ఆర్టెమిస్-2’ ప్రయోగంలో భాగంగా అంతరిక్షం నుంచి తీసిన చంద్రుడు, భూమి హైక్వాలిటీ ఫొటోలను నాసా విడుదల చేసింది. బూడిద రంగులో జాబిల్లి కనువిందు చేస్తుండగా, భూమి నెలవంక అబ్బురపరుస్తోంది. ప్రస్తుతం వ్యోమగాములు తిరుగు ప్రయాణంలో ఉన్నారు.
News April 9, 2026
విద్యార్థులకు అలర్ట్.. ఆధార్ అప్డేట్ కోసం స్పెషల్ క్యాంపులు

AP: ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ కోసం స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డులు, అంగన్వాడీల్లో ప్రభుత్వం స్పెషల్ క్యాంపులు నిర్వహించనుంది. తొలి విడతలో ఈ నెల 15 నుంచి 18 వరకు, రెండో విడతలో ఈ నెల 21 నుంచి 24 వరకు అవకాశం ఉంటుంది. బయోమెట్రిక్ అప్డేట్ లేకపోతే విద్యార్థులకు ప్రభుత్వ పథకాలు, స్కాలర్‌షిప్‌లు అందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 12.09 లక్షల మంది తమ డేటాను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది.


