News June 28, 2024
సీజనల్ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి: DMHO సుహాసిని

ప్రజలు ఇంటితో పాటు, పరిసరాల్లో దోమలు వ్యాప్తి చెందకుండా చూసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ సుహాసిని ప్రకటనలో తెలిపారు. సీజనల్ వ్యాధులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, ముందస్తుగా తీసుకునే చర్యల గురించి వివరిస్తున్నామన్నారు. బయట ఆహారాలు తినకుండా, ఇంట్లో తయారు చేసిన వేడి వేడి ఆహారం తీసుకుంటే మంచిదన్నారు.
Similar News
News September 15, 2025
కృష్ణా జిల్లాలో ఇంటి స్థలం కోసం 19,382 దరఖాస్తులు

కృష్ణా జిల్లాలో గృహ సముదాయాల కోసం ఇప్పటివరకు 19,382 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా రెవెన్యూ అధికారుల సమాచారం ప్రకారం.. గుడివాడ డివిజన్‌లో 3,364 మంది, మచిలీపట్నం డివిజన్‌లో 6,083 మంది, ఉయ్యూరు డివిజన్‌లో 9,935 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించారు. అయితే, స్థలాల కేటాయింపు, పట్టాల పంపిణీపై స్పష్టత లేకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.
News September 15, 2025
మచిలీపట్నంలో మీకోసం కార్యక్రమం: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి.కె. బాలాజీ ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.
News September 14, 2025
కృష్ణాజిల్లా టుడే టాప్ న్యూస్

☞ మచిలీపట్నం ఎంపీకి మూడవ ర్యాంక్
☞ జగన్ ఓ డ్రామాల కింగ్: ఎంపీ
☞ గన్నవరం విమానాశ్రయంలో కనకదుర్గమ్మ దివ్య దర్శనం
☞ మోపిదేవి: సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయంలో భక్తుల రద్దీ
☞ కృష్ణాజిల్లా ఎస్పీ నేపథ్యం ఇదే.!
☞ గన్నవరం ఎయిర్పోర్ట్ బోర్డు విషయంలో ఎమ్మెల్యే అసంతృప్తి
☞ గన్నవరం: హాస్టల్ వంట మనిషిపై విద్యార్థుల దాడి