News June 28, 2024

మేం పొరపాటు చేశాం: బట్లర్

image

T20WC సెమీస్‌లో భారత్‌ చేతిలో ఓటమిపై ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ స్పందించారు. స్పిన్నర్లు రషీద్, లివింగ్‌స్టోన్ రాణించినా మరో స్పిన్నర్ మొయిన్ అలీతో బౌలింగ్ చేయించకపోవడం తమ విజయావకాశాలను దెబ్బతీసిందన్నారు. కఠినమైన పిచ్‌పై 145-150రన్స్‌కే కట్టడి చేయాలని చూశామని, కానీ భారత్ అంతకంటే ఎక్కువ పరుగులు చేసిందన్నారు. టీమ్ ఇండియా అన్ని విభాగాల్లో అద్భుతంగా ఆడిందని, విజయానికి వారు అర్హులని బట్లర్ అన్నారు.

Similar News

News September 20, 2024

లంచ్ సమయానికి బంగ్లాదేశ్ 26/3

image

చెన్నై టెస్టులో బంగ్లా బ్యాటర్లు తడబడుతున్నారు. బుమ్రా 1, ఆకాశ్ దీప్ 2 వికెట్లు తీయడంతో 26 పరుగులకే ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 376 రన్స్ చేసి ఆలౌటైన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ ఎంత స్కోర్ చేస్తుందని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి.

News September 20, 2024

ఓటుకు నోటు కేసు బదిలీకి సుప్రీం నో

image

ఓటుకు నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని BRS MLA జగదీశ్ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు అంగీకరించలేదు. కేసు విచారణను రేవంత్ ప్రభావితం చేస్తారనేది అపోహ మాత్రమేనని చెప్పింది. ఈ పిటిషన్‌ను ఎంటర్‌టైన్ చేయలేమంటూ పిటిషన్‌పై విచారణను ముగించింది. రేవంత్ రెడ్డికి కేసు విషయాలు రిపోర్ట్ చేయవద్దని ఏసీబీని ఆదేశించింది.

News September 20, 2024

సిట్టింగ్ జడ్జి/ హైకోర్టు కమిటీతో విచారించాలి:YCP

image

తిరుమల లడ్డూ ప్రసాదంపై CM చంద్రబాబు చేసిన ఆరోపణలపై హైకోర్టును ఆశ్రయించినట్లు YCP ట్వీట్ చేసింది. ‘హైకోర్టులో వైసీపీ న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రసాదాల్లో జంతువుల కొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జితో లేదా ఒక కమిటీ ఏర్పాటు చేసి విచారించాలని హైకోర్టును న్యాయవాది కోరారు. పిల్ దాఖలు చేస్తే బుధవారం వాదన వింటామని ధర్మాసనం చెప్పింది’ అని YCP ట్వీట్ చేసింది.