News June 28, 2024
అంబానీపై ట్రోల్స్.. ‘కొడుకు పెళ్లి ఖర్చును మా మీద వేస్తున్నావా?’

రిలయన్స్ జియో రీఛార్జ్ ధరలను భారీగా పెంచడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘కొడుకు పెళ్లి ఖర్చు మొత్తాన్ని దేశ ప్రజల నెత్తిన పడేస్తున్నావా అంబానీ మావా’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ‘ఎన్నికలు అయిపోయాయి కదా ఇక బాదుడే బాదుడు’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య జియో సిగ్నల్ కూడా సరిగా రావట్లేదని ఫైరవుతున్నారు.
Similar News
News January 25, 2026
బంగ్లాదేశ్‌కు అన్యాయం జరిగింది: నఖ్వీ

T20 WC నుంచి తప్పించి బంగ్లాదేశ్‌కు ICC అన్యాయం చేసిందని PCB ఛైర్మన్ మోషిన్ <<18947264>>నఖ్వీ<<>> అన్నారు. ‘భారత్, పాకిస్థాన్ కోసం వెన్యూలు మార్చినప్పుడు బంగ్లాదేశ్ కోసం ఎందుకు మార్చరు? ఐసీసీని ఒకే దేశం డిక్టేట్ చేస్తోంది. ఐసీసీకి డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదు. ఓ దేశం కోసం నచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటారు. మరో దేశానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటారు. అందుకే మేం బంగ్లాదేశ్‌కు మద్దతిస్తున్నాం’ అని తెలిపారు.
News January 25, 2026
వివేక్ ఆత్రేయతో రవితేజ సినిమా?

సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న మాస్ మహరాజా రవితేజ యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో ఓ సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. కొత్త తరహా కథలను తెరకెక్కించే వివేక్ ‘సరిపోదా శనివారం’ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నారు. రజినీకాంత్, సూర్యకు ఆయన స్టోరీ వినిపించారని అంతకుముందు ప్రచారం జరిగింది. కానీ అవి ఓకే కాలేదని తెలుస్తోంది. కాగా రవితేజ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు.
News January 25, 2026
నో కాస్ట్ EMI.. మీకు ఈ విషయాలు తెలుసా?

‘నో కాస్ట్ EMI’తో ఆన్‌లైన్‌లో వస్తువులు కొంటే వడ్డీ ఉండదని అనుకుంటాం. కానీ వస్తువు ధరలోనే వడ్డీ కలిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ‘నో కాస్ట్ EMI వల్ల భారీ డిస్కౌంట్లు కోల్పోతారు. అదనంగా ప్రాసెసింగ్ ఫీజు+GST కూడా చెల్లించాల్సి వస్తుంది. ఎక్కువ EMIల వల్ల క్రెడిట్ యుటిలైజేషన్ రేట్ పెరిగి సిబిల్ స్కోర్ తగ్గొచ్చు’ అని పేర్కొంటున్నారు. కొనేముందు అసలు ధరతో EMI ధర కంపేర్ చేసుకోవాలని సూచిస్తున్నారు.


