News June 28, 2024
నేడు పీవీ నరసింహారావు జయంతి

తెలంగాణలో జన్మించి దేశ దశాదిశా మార్చిన మహా నాయకుడు పీవీ నరసింహారావు. 1952లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పీవీ.. MLA, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధాని పదవులను అలంకరించారు. సంస్కరణలకు బీజం వేసి కుంటుపడుతున్న దేశ ఎకానమీని పట్టాలెక్కించారు. పీవీ చొరవతోనే ఎన్నో విదేశీ కంపెనీలు మన దేశంలో పెట్టుబడులు పెట్టాయి. ఆ ఫలాలు నేటి తరం అనుభవిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో పీవీని భారతరత్న పురస్కారం వరించింది.
Similar News
News January 12, 2026
జగిత్యాల: ‘మరణం నా చివరి చరణం కాదు’

జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ <<18824184>>జయంతి, వర్ధంతి<<>> నేడు. తక్కువ కాలమే జీవించినప్పటికీ తన కవితలతో ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారు. పేదల బాధలు, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను సూటిగా, సరళమైన మాటల్లో చెప్పారు. “ఊరేగింపును సమష్టి బాధల శ్వాస”గా చెప్పిన ఆయన మాటలు ప్రసిద్ధి చెందాయి. ‘మరణం నా చివరి చరణం కాదు’ వంటి మాటల తూటాలు పేల్చారు. ‘సిటీలైఫ్’ మినీ కవితలు మంచి గుర్తింపు పొందాయి.
News January 12, 2026
టీచర్లకు ‘పరీక్ష’!

AP: టెట్‌లో <<18811070>>ఫెయిలైన<<>> ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. పిల్లలకు పాఠాలు బోధిస్తూ ప్రిపేర్ అవ్వడం కుదరలేదని వాపోతున్నారు. 150మార్కుల్లో సంబంధిత సబ్జెక్టు నుంచి 60, మిగతావాటి నుంచి 90 మార్కులకు ప్రశ్నలిచ్చారు. దీంతో లాంగ్వేజ్, సోషల్ టీచర్లకు ఇది సులభమే అయినా సైన్స్, మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్ టీచర్లకు ఇబ్బందిగా మారింది. అయితే టీచర్లకు టెట్ మినహాయింపుపై కేంద్రం <<18828506>>పునరాలోచన<<>> వార్తలు ఉపశమనం కలిగిస్తున్నాయి.
News January 12, 2026
APPLY NOW: హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

వైజాగ్‌లోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (<


