News June 28, 2024
నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం.. భర్తను చంపిన భార్య

నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. గురువారం అర్ధరాత్రి జిల్లా కేంద్రంలోని HP పెట్రోల్ పంప్ వెనకాల భార్యాభర్తల మధ్య గొడవ జరగగా భార్య శివలీల భర్త శివపై కర్రతో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో శివ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య శివలీలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 6, 2026
MBNR: చైనా మంజా విక్రయిస్తే ఫోన్ చేయండి: SP

ఎవరైనా చైనా మంజా విక్రయాలు లేదా వినియోగం గమనించినట్లయితే వెంటనే డయల్-100కు లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712659360కి సమాచారం ఇవ్వాలని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. జిల్లా పరిధిలో ఎక్కడా చైనా మంజా విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, రాబోయే సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని, జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక తనిఖీలు వెల్లడించారు.
News January 6, 2026
MBNR: మున్సిపాల్ ఎన్నికలు.. ఈనెల 10న తుది జాబితా

రాబోయే రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో కలెక్టర్ విజయేందిర బోయి మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల వారీగా
ఈనెల 1న ఓటర్ ముసాయిదా జాబితా ప్రచురించారు. అనంతరం పోలింగ్ కేంద్రాల వారీగా ముసాయిదా ఓటరు జాబితాలో ఈనెల 8 వరకు అభ్యంతరాలు స్వీకరించి, అభ్యంతరాలు పరిష్కరించి ఈనెల 10న తుది జాబితా ప్రచురించనున్నారు.
News January 6, 2026
MBNR: ట్రాన్స్‌జెండర్లకు గుడ్ న్యూస్.. APPLY NOW

జిల్లాలోని ట్రాన్స్‌జెండర్ల ఆర్థిక పునరావాసం కోసం 100% సబ్సిడీతో కూడిన పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారిణి S.జరీనా బేగం తెలిపారు. జిల్లాకు కేటాయించిన ఒక యూనిట్ కింద ముగ్గురు ట్రాన్స్‌జెండర్లను ఎంపిక చేసి, ఒక్కొక్కరికి రూ.75 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీలోగా జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.


