News June 28, 2024

రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డ్

image

రిలయన్స్ ఇండస్ట్రీస్ ₹21లక్షల కోట్ల మార్కెట్ విలువ ఉన్న తొలి భారతీయ సంస్థగా అరుదైన ఘనత సాధించింది. ఈరోజు ట్రేడింగ్‌లో RIL షేర్ విలువ 1.5% పెరిగి ₹3129కు చేరింది. జియో టారిఫ్ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించినా రిలయన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. కాగా ఈ ఏడాదిలో రిలయన్స్ స్టాక్స్ 20% పెరగడం విశేషం. అంచనాలకు తగినట్లే టారిఫ్ పెంపు ఉండటంతో ఇన్వెస్టర్లు నిరాశ చెందలేదని నిపుణులు చెబుతున్నారు.

Similar News

News January 15, 2026

MOIL లిమిటెడ్‌లో 67 పోస్టులు.. అప్లై చేశారా?

image

<>MOIL<<>> లిమిటెడ్‌లో 67 గ్రాడ్యుయేట్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech(మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, మెటలర్జీ), MSc( జియాలజీ), PG(సోషల్ వర్క్)ఎంబీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. CBT,ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.590. SC, ST, PwBDలకు ఫీజులేదు. సైట్: https://www.moil.nic.in

News January 15, 2026

సంక్రాంతి అల్లుడికి 158 రకాల వంటకాలతో విందు

image

AP: గోదావరి జిల్లాలను మరిపించేలా ఈసారి తెనాలి వాసులు అల్లుడికి 158 రకాల వంటకాలతో అదిరిపోయే ఆతిథ్యం ఇచ్చారు. తెనాలికి చెందిన మురళీకృష్ణ తన కుమార్తె మౌనికను రాజమండ్రికి చెందిన శ్రీదత్తకు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లైన తర్వాత వచ్చిన తొలి సంక్రాంతి కావడంతో అల్లుడికి కళ్లు చెదిరే విందు ఏర్పాటు చేశారు. రకరకాల పిండి వంటలు, ఫలహారాలు, పండ్లతో భోజనం వడ్డించి ఆశ్చర్యపరిచారు.

News January 15, 2026

తగ్గిన బంగారం ధర.. మరోసారి పెరిగిన వెండి ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.820 తగ్గి రూ.1,43,180కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.750 తగ్గి రూ.1,31,250గా ఉంది. మరోవైపు వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. నిన్న కేజీపై రూ.15,000 పెరగగా, ఈరోజు రూ.3,000 పెరిగింది. మొత్తంగా రెండు రోజుల్లో 18,000 ఎగబాకి రూ.3,10,000 చేరింది.