News June 28, 2024
భారత ఓపెనర్లు సెంచరీలు

సౌతాఫ్రికా మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్లు సెంచరీలతో కదం తొక్కారు. షఫాలీ వర్మ(117*), మంధాన(111*) సఫారీ బౌలర్లను చీల్చి చెండాడుతున్నారు. దీంతో 45 ఓవర్లకు భారత్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 230 రన్స్ చేసింది. వన్డే సిరీస్‌లోనూ మంధాన రెండు సెంచరీలతో పాటు మూడో వన్డేలో 90 రన్స్ బాదిన విషయం తెలిసిందే.
Similar News
News January 8, 2026
ఫిబ్రవరి 3న మున్సిపల్ ఎన్నికలు: రాంచందర్ రావు

TG: రాష్ట్రంలో ఫిబ్రవరి 3న మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు చెప్పారు. ఎన్నికలకు ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చిందని, ఈ నెల 16 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. వరంగల్‌లో జరిగిన బీజేపీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎలక్షన్స్‌లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎన్నికల తేదీలు ఇవేనంటూ ఈసీ కంటే ముందే రాంచందర్ రావు ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది.
News January 8, 2026
HT పత్తి విత్తనాలు కొనొద్దు: మంత్రి తుమ్మల

TG: HT పత్తి విత్తనాల అమ్మకాలను రాష్ట్రంలో అరికట్టాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. ఫీల్డ్ ట్రయల్స్‌లో ఫెయిలైనందున కేంద్రం ఆ కంపెనీ విత్తనాల అమ్మకాలకు పర్మిషన్ ఇవ్వలేదన్నారు. అధిక దిగుబడి వస్తుందనే ఆశతో రైతులు HT పత్తి విత్తనాలను కొని మోసపోవద్దని కోరారు. పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కో-మార్కెటింగ్‌కు విధివిధానాలు రూపొందించాలన్నారు.
News January 8, 2026
వాహనదారులకు అలర్ట్.. ఈ విషయం తెలుసా?

హెల్మెట్, లైసెన్స్ ఉంటే సరిపోదు మీ వాహనం అన్-సేఫ్ కండిషన్‌లో ఉన్నా భారీ ఫైన్ తప్పదనే విషయం మీకు తెలుసా? MV యాక్ట్-2019 ప్రకారం మీ బైక్/కారులో లోపాలున్నా భారీ ఫైన్ విధిస్తారు. మీ వాహన లోపాల వల్ల ఇతరులకు ప్రమాదం జరగొచ్చని చర్యలు తీసుకోవచ్చు. ఇండికేటర్ పని చేయకపోయినా రూ.5వేలు ఫైన్/ 3 నెలలు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది. అందుకే మీ వాహనాన్ని ఓసారి చెక్ చేసుకోండి. SHARE IT


