News June 28, 2024
NLG: గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

నల్గొండలోని NG కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా. ఉపేందర్ తెలిపారు. తెలుగు-2, వాణిజ్యశాస్త్రం-3, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్-3′ కంప్యూటర్ సైన్స్\అప్లికేషన్స్-6, డాటా సైన్స్-1 గణితశాస్త్రం-2, స్టాటస్టిక్స్-1, బయోటెక్నాలజీ-1 సబ్జెక్టుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News October 31, 2025
NLG: ఆ నిబంధనలు.. రైతులతో పరిహాసమే!

అటు ప్రకృతి.. ఇటు పాలకులు రైతులకు కన్నీరు తెప్పిస్తున్నారు. మొంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీగానే పంట నష్టం జరిగింది. చేతికొచ్చిన పంట నేలవాలడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. 33 శాతానికి పైగా దెబ్బతింటేనే పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లాలో నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందే సూచనలు కనిపించడం లేదు. జిల్లాలో ప్రాథమిక అంచనా ప్రకారం 61,511 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.
News October 31, 2025
NLG: 61, 511 ఎకరాల్లో పంట నష్టం

‘మొంథా’ జిల్లాలో రైతులను నిలువునా ముంచింది. వర్షం కారణంగా వరి, పత్తి, మిర్చి పంటలు, రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. 310 గ్రామాల్లో 30,359 మంది రైతులకు చెందిన 61,511 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ప్రభుత్వం 33 శాతం పైబడి పంట నష్టపోయిన వివరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. చేతికొచ్చే దశలో ఉన్న పంటలకు తీరని నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు.
News October 31, 2025
NLG: నేటి నుంచి రైళ్ల పునరుద్ధరణ

సికింద్రాబాద్ నుంచి BNG మీదుగా విజయవాడ, విశాఖపట్నం వెళ్లే రైళ్లను శుక్రవారం నుంచి పునరుద్ధరించనున్నారు. మొంథా తుపాన్ కారణంగా ఆయా స్టేషన్లకు భువనగిరి మీదుగా వెళ్లే గౌతమి, గోదావరి, కృష్ణా ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. డోర్నకల్లో వరద నీరు ఉండడంతో ఆయా రైళ్లను NLG రైలు మార్గం గుండా వెళ్లేందుకు మళ్లించారు. తెలంగాణ, దక్షిణ ఎక్స్ప్రెస్ రైళ్లు BNG మీదుగా వెళ్లే అవకాశం ఉంది.


