News June 28, 2024

పరీక్షల్లో సంస్కరణలకు కమిటీ.. మీ సలహాలు ఇవ్వండి: కేంద్రం

image

పరీక్షల నిర్వహణలో సంస్కరణలకు, NTA ప్రక్షాళన కోసం కేంద్రం ఓ ఉన్నతస్థాయి <<13490528>>కమిటీని<<>> ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇస్రో మాజీ ఛైర్మన్ కె.‌రాధాకృష్ణన్ నేతృత్వంలోని ఈ కమిటీ విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి సలహాలు స్వీకరిస్తోంది. జులై 7 వరకు వాటిని సమర్పించవచ్చని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. ఇందుకోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News November 12, 2025

ఎల్లుండి నుంచి టెన్త్ పరీక్షల ఫీజు స్వీకరణ

image

AP: టెన్త్ పరీక్షల ఫీజును ఎల్లుండి(NOV 13) నుంచి ఈ నెల 25 వరకు స్వీకరిస్తామని విద్యాశాఖ తెలిపింది. రెగ్యులర్, ఒకేషనల్, గతంలో టెన్త్ ఫెయిలైన వారు ఫీజును చెల్లించవచ్చని పేర్కొంది. లేట్ ఫీ రూ.50తో డిసెంబర్ 3 వరకు, రూ.200తో డిసెంబర్ 10 వరకు, రూ.500తో డిసెంబర్ 15 వరకు అవకాశం ఉంటుందని వెల్లడించింది. స్కూల్ హెడ్ మాస్టర్లు https://bse.ap.gov.in/లో స్కూల్ లాగిన్ ద్వారా ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.

News November 12, 2025

IPL: ఫ్రాంచైజీలు రిలీజ్ చేసేది వీరినేనా?

image

CSK: శంకర్, కాన్వే, హుడా, అశ్విన్, త్రిపాఠి
DC: ముకేశ్, చమీర, నటరాజన్, మోహిత్, డుప్లెసిస్
GT: రషీద్, షారుక్, ఇషాంత్, Tewatia
KKR: V iyer, అలీ, డికాక్, రమణ్‌
LSG: షమర్, సమద్, MI: D చాహర్, Topley, ముజీబ్
PBKS: Maxy, స్టొయినిస్, Ferguson, Jamieson
RR: మధ్వాల్, ఫారూఖీ, బర్గర్, తీక్షణ, Hetmyer, తుషార్
SRH: Ishan, shami, జంపా, అభినవ్, R చాహర్, హర్షల్
RCB: పడిక్కల్, షెపర్డ్, రసిఖ్, సుయాశ్, లివింగ్‌స్టోన్

News November 11, 2025

బిహార్ ఎలక్షన్స్: ALL TIME RECORD

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు నమోదయింది. ఫేజ్-1(65.08%), ఫేజ్-2(68.76%) కలిపి ఈసారి మొత్తం 66.91% ఓట్లు పోలయ్యాయి. 1951లో తొలి ఎలక్షన్ జరిగినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. మహిళల ఓటింగ్‌లోనూ ఈసారి రికార్డు స్థాయిలో 71.6% ఓటింగ్ నమోదైంది. ఎన్నికల ఫలితాలు ఈ నెల 14న వెలువడనుండగా ఎగ్జిట్ పోల్స్ NDAకే విజయావకాశాలు ఉన్నాయని అంచనా వేశాయి..