News June 28, 2024
సూర్యాపేట: వ్యక్తిపై 50 కోతుల దాడి, తీవ్ర గాయాలు

మఠంపల్లి మండల పరిధిలోని రఘునాథపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిపై సుమారుగా 50 కోతులు మూకుమ్మడిగా దాడి చేయగా వ్యక్తి తీవ్ర గాయాలై ఆసుపత్రికి తరలించినట్లు బంధువులు తెలిపారు. గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా ఉందని గ్రామస్థులు తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆవేదన చెందారు. ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు.
Similar News
News November 12, 2025
NLG: ఆ సంచి ప్రచారానికేనా..!

రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు అందిస్తున్న ప్లాస్టిక్ రహిత సంచులు ప్రచారానికే తప్ప బియ్యం తీసుకెళ్లేందుకు పనికిరావడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సంచుల కొలతలు, పోర్టబిలిటీ, బయోమెట్రిక్ నిబంధనలపై రేషన్ డీలర్లు, కార్డుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 4,66,100 రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే ఈ సంచులు కేవలం 12 కిలోల బియ్యం మాత్రమే తీసుకెళ్లేలా రూపొందించారు.
News November 12, 2025
NLG: ఆశల సాగులో రైతన్న.. యాసంగికి సిద్ధం

ఆశల సాగులో రైతన్న కొట్టుమిట్టాడుతున్నాడు. ఒకసారి కాకుంటే మరో సారి కాలం కలిసి రాదా అనే ఆశతో నల్గొండ జిల్లాలో రైతన్న యాసంగి సాగుకు సిద్ధమవుతున్నాడు. వానకాలంలో అధిక వర్షాలు నిండా ముంచాయి. పత్తి, వరి తదితర పంటలు దెబ్బతిని రైతులు నష్టాలు చవిచూశారు. వానకాలం నష్టాలు మిగిల్చినా యాసంగికైనా కలిసొస్తుందేమో అనే ఆశతో సాగుకు సన్నద్ధమవుతున్నాడు.
News November 12, 2025
నల్గొండకు నేషనల్ అవార్డు

జల్ సంజయ్ జన్ భాగిదారీలో రాష్ట్రానికి తొలి ర్యాంకు వచ్చింది. రాష్ట్రంలో నల్గొండతో పాటు ఆదిలాబాద్ మంచిర్యాల జల సంరక్షణలో టాప్‌లో నిలిచిన విషయం విదితమే. ఈ పథకాన్ని పక్కాగా అమలు పరిచినందుకు జిల్లాకు కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డు ప్రకటించింది. ఈ అవార్డు జిల్లాకు రావడం తొలిసారి. కలెక్టర్ ఇలా త్రిపాఠి చొరవ వల్లే ఇది సాధ్యమైంది. ఈ పురస్కారం కింద రూ.2 కోట్ల నగదు ప్రోత్సాహకం లభించనుంది.


