News June 28, 2024

కప్ సాధించేందుకు రోహిత్ పూర్తి అర్హుడు: అక్తర్

image

T20 WC సాధించేందుకు రోహిత్ శర్మ పూర్తి అర్హుడని పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నారు. టెస్టు ఛాంపియన్ షిప్, ODI వరల్డ్ కప్ మిస్ అయిన భారత్‌కు పొట్టి కప్ నెగ్గే అర్హత కచ్చితంగా ఉందన్నారు. ‘ఏమాత్రం స్వార్థం లేని ఆటగాడు రోహిత్. స్వప్రయోజనాల కంటే జట్టే ముఖ్యమని భావిస్తారు. గత ఏడాది వన్డే వరల్డ్ కప్ భారత్ ఓడినప్పుడు చాలా బాధ కలిగింది. ఆ జట్టు కప్ గెలిచేందుకు అన్ని విధాలా సరైనది’ అని పేర్కొన్నారు.

Similar News

News September 20, 2024

తిరుమలలో లడ్డూ ప్రసాదం ఎప్పుడు మొదలైందంటే..

image

భక్తులు అమృతంగా భావించే తిరుమల లడ్డూ పంపిణీ ఎప్పటి నుంచి ప్రారంభమైంది? దీనిపై భిన్న కథనాలున్నాయి. అయితే 1803 నుంచి బూందీ ప్రసాద వితరణ ప్రారంభమైందనేది చరిత్రకారుల అంచనా. ఆ తర్వాత అనేక మార్పులతో 1940 నాటికి ఇప్పుడున్న లడ్డూగా స్థిరపడిందని చెబుతున్నారు. అంతకంటే ముందు తిరుప్పొంగం, సుఖీయం, 1455లో అప్పం, వడ(1460), అత్తిరసం(1468), మనోహరపడి(1547) ప్రసాదాలను భక్తులకు అందించేవారని తెలుస్తోంది.

News September 20, 2024

ALERT.. ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణలో మళ్లీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

News September 20, 2024

రేపు పండితులతో సీఎం చంద్రబాబు సమావేశం

image

AP: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడటంపై శాస్త్రాల పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. రేపు ఆగమ, వైదిక పరిషత్‌లతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆలయ శుద్ధి అవసరమా? తదితర అంశాలపై పండితులు ఇచ్చే సూచనలు, సలహాలతో తదుపరి చర్యలు తీసుకోనున్నారు.