News June 28, 2024

అమెరికా, కెనడా నిపుణులను రప్పిస్తున్నాం: సీఎం చంద్రబాబు

image

AP: పోలవరం ప్రాజెక్టు కట్టడం కంటే మరమ్మతు ఇంకా కష్టమైన పనిగా మారిందని CM చంద్రబాబు చెప్పారు. తాము పడిన శ్రమను జగన్ వృథా చేశారని ఆరోపించారు. ప్రాజెక్టు మరమ్మతుల కోసం అమెరికా, కెనడా నుంచి నిపుణులను రప్పిస్తున్నామని, వారు ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తారని తెలిపారు. పోలవరాన్ని ఎంతకాలంలో బాగు చేయొచ్చో నిపుణులే చెప్పాల్సి ఉందన్నారు. ఇటీవల ప్రాజెక్టును చూసి కళ్ల వెంట నీళ్లు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News October 11, 2024

తెలంగాణపై వివక్ష ఎందుకు?: హరీశ్‌రావు

image

తెలంగాణకు కేంద్రం మళ్లీ మొండిచేయి చూపిందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ‘గోదావరి పుష్కరాల కోసం APకి రూ.100 కోట్లు ఇచ్చి, TGకి సున్నా ఇచ్చారు. 8 మంది BJP MPలు, ఇద్దరు కేంద్ర మంత్రులున్నా ఒక్క రూపాయి సాధించలేదు. బడ్జెట్లోనూ TGకి 0 కేటాయించి, APకి ₹15,000 కోట్లు ఇచ్చారు. APకి ఇచ్చారని బాధ కాదు, తెలంగాణకు అన్యాయం జరుగుతోందనేదే మా ఆవేదన. TGని ఇతర రాష్ట్రాలతో సమానంగా చూడాలి’ అని డిమాండ్ చేశారు.

News October 11, 2024

పనిచేయని Govt ఉద్యోగులకు డేంజర్ బెల్స్: వేటు వేయాలని మోదీ ఆదేశం

image

అవినీతిపరులు, పనిచేయని అధికారులపై వేటు వేయాలని యూనియన్ సెక్రటరీలను PM మోదీ ఆదేశించారు. రూల్స్ ప్రకారం వారి పనితీరును మూల్యాంకనం చేయాలని సూచించారు. అంచనాలను అందుకోని వారికి CCS రూల్స్‌లోని ఫండమెంటల్ రూల్ 56(j), రూల్ (48) ప్రకారం రిటైర్మెంట్ ఇచ్చేయాలని బుధవారం ఆదేశించినట్టు తాజాగా తెలిసింది. వీరికి 3 నెలల నోటీస్ లేదా వేతనం ఇస్తారు. ఈ రూల్స్ అమల్లోకి వచ్చాక ప్రభుత్వం 500 మందిని ఇంటికి పంపేసింది.

News October 11, 2024

BREAKING: టాటా ట్రస్టు ఛైర్మన్‌గా నోయల్ టాటా

image

రతన్ టాటా మరణంతో టాటా ట్రస్టు ఛైర్మన్‌గా నోయల్ టాటా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు బోర్డు సభ్యులు ఓ ప్రకటన చేశారు. ఈయన రతన్‌కు వరుసకు సోదరుడు అవుతారు. ఇప్పటికే టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, టాటా ఇంటర్నేషనల్ కంపెనీలకు ఛైర్మన్, టాటా స్టీల్, టైటాన్ సంస్థలకు వైస్‌ఛైర్మన్‌గా నోయల్ వ్యవహరిస్తున్నారు.