News June 28, 2024
బైడెన్‌పై అసంతృప్తి… ఇప్పుడు అభ్యర్థిని మార్చొచ్చా?

డొనాల్డ్ ట్రంప్‌తో డిబేట్‌లో US అధ్యక్షుడు జో బైడెన్ ప్రదర్శనపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి నెలకొన్న వేళ ఆయన అభ్యర్థిత్వం చర్చనీయాంశమైంది. బైడెన్ స్వయంగా తప్పుకుంటే తప్ప మార్పు దాదాపు అసాధ్యమనేది విశ్లేషకుల మాట. ట్రంప్‌కూ ఇదే వర్తిస్తుందంటున్నారు. ఇద్దరికీ వారి పార్టీల్లోని డెలిగేట్స్ మద్దతు ఉండటమే కారణం. త్వరలో సంబంధిత కన్వెన్షన్లలో పార్టీలు వీరి అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించనున్నాయి.
Similar News
News September 19, 2025
విమానంపై పిడుగు పడితే ఏమవుతుందంటే?

వర్షాల సమయంలో ఎగురుతున్న విమానాలు కొన్నిసార్లు పిడుగుపాటుకు గురవుతుంటాయి. అయితే ఎన్ని పిడుగులు పడినా ఫ్లైట్ లోపల ఉన్నవారికి ఏమీ కాదు. ఎందుకంటే ప్రస్తుతం విమానాలను ఫెరడే కేజ్ అనే లేయర్‌తో తయారు చేస్తున్నారు. ఈ ప్రత్యేక లోహం ఫ్లైట్‌లోకి విద్యుదయస్కాంత క్షేత్రాలు వెళ్లకుండా నియంత్రిస్తుంది. పిడుగు పడగానే ఇవి ఈ లోహపు నిర్మాణం గుండా ఒక వైపు నుంచి మరో వైపునకు వెళ్లిపోతాయి. దీని వల్ల ఎవరికీ ఏమీ కాదు.
News September 19, 2025
దసరా సెలవులు.. స్కూళ్లు, కాలేజీలకు హెచ్చరిక

TG: దసరా సెలవుల్లో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో ఎలాంటి తరగతులు నిర్వహించవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సెలవుల్లో రివిజన్ కోసం విద్యార్థులకు కొంత హోమ్ వర్క్ ఇవ్వాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు, జూ.కాలేజీలకు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉండనున్నాయి.
News September 19, 2025
పార్టీ ఫిరాయింపులు.. ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు

TG: పార్టీ ఫిరాయింపులపై ఆరుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు పంపారు. తాము పార్టీ మారలేదని ఎమ్మెల్యేలు చెప్పగా, దానిపై సంతృప్తి చెందని స్పీకర్ మరిన్ని ఆధారాలు కావాలని కోరారు. త్వరలో ఎమ్మెల్యేల విచారణకు ట్రయల్ మొదలుపెట్టనున్నట్లు సమాచారం. సంజయ్, పోచారం, యాదయ్య, వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డిలకు ఈ నోటీసులు ఇచ్చారు.