News June 28, 2024
PSU స్టాక్స్‌ను విక్రయించనున్న కేంద్రం?

రక్షణ, రైల్వే, ఎరువుల రంగాల్లోని పీఎస్‌యూ షేర్లలో కొంతభాగాన్ని విక్రయించేందుకు కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో మజగాన్ డాక్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్ప్ (IRFC), నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ మొదలైన సంస్థలు ఉన్నాయి. ఒక్క IRFC నుంచే కేంద్రానికి ₹7600 కోట్లు రానుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆస్తులు అమ్మి కేంద్రం ₹50వేల కోట్లు రాబట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Similar News
News April 7, 2026
IPLకు ₹2,400 కోట్ల నష్టం: లలిత్ మోదీ

IPL పాత ఫార్మాట్‌ను పాటించకపోవడం వల్ల BCCI ₹2,400 కోట్ల ఆదాయాన్ని కోల్పోతోందని మాజీ కమిషనర్ లలిత్ మోదీ విమర్శించారు. ‘10 జట్లు ఉన్నప్పుడు ప్రతి టీమ్ పరస్పరం 2సార్లు (హోమ్-అవే) తలపడితే 94 మ్యాచ్‌లు జరగాలి. ప్రస్తుతం 74 మ్యాచ్‌లే నిర్వహిస్తున్నారు. తగ్గిన 20 మ్యాచ్‌ల వల్ల ఒక్కో మ్యాచ్‌కు వచ్చే ₹118 కోట్ల మీడియా రైట్స్ ఆదాయం పోతోంది. ఫ్రాంచైజీలూ ₹120 కోట్ల చొప్పున నష్టపోతున్నాయి’ అని వివరించారు.
News April 7, 2026
భారతీయులు గర్వించదగ్గ క్షణం: CM చంద్రబాబు

AP: భారత్ రెండో దశ న్యూక్లియర్ ప్రోగ్రాంలో <<19586211>>సక్సెస్<<>> అవడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ‘ఈ విజయం దేశ అణు విద్యుత్ రంగంలో కీలక మైలురాయి. మూడో దశకు చేరుకోవడానికి మార్గం సుగమం చేసింది. భవిష్యత్తులో థోరియం నిల్వలను వినియోగించుకుంటూ ఇంధన భద్రతను సాధించేందుకు ఈ విజయం కీలకం కానుంది. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణం’ అని CBN ట్వీట్ చేశారు.
News April 7, 2026
16 ఏళ్లుగా గాలింపు.. ఇవాళ దొరికిన టెర్రరిస్టు

జమ్మూకశ్మీర్ పోలీసులు లష్కరే తోయిబా ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్న ఐదుగురిని అరెస్టు చేశారు. అందులో ఇద్దరు పాకిస్థానీ టెర్రరిస్టులు కాగా ముగ్గురు వారి సహాయకులు అని పోలీసులు వెల్లడించారు. వారిలో ఒక ఉగ్రవాదిని అబ్దుల్లా అలియాస్ అబు హురైరాగా గుర్తించారు. ఇతడి కోసం 16 ఏళ్లుగా వెతుకుతున్నారు. మరో ఉగ్రవాదిని ఉస్మాన్‌గా గుర్తించారు. J&K, రాజస్థాన్, హరియాణా సహా 19 ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించారు.


