News June 28, 2024
రెండు నెలల ద్రవ్యలోటు @ ₹50వేలకోట్లు

ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు నెలల్లో (APR-MAY) ద్రవ్యలోటు ₹50,615కోట్లుగా నిలిచింది. ఇది ఈ ఏడాదికి కేంద్రం వేసిన అంచనాలో 3శాతం. కాగా గత ఏడాది ఇదే సమయానికి ఈ మొత్తం 11.8%గా ఉంది. ఖర్చు కంటే కేంద్రానికి ఆదాయం ఎక్కువ వచ్చినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ వెల్లడించింది. ₹90,923Cr ఆర్జించినట్లు తెలిపింది. ట్యాక్స్ రెవెన్యూ, RBI డివిడెండ్‌తో రెవెన్యూ రిసీట్స్ 19%కు చేరాయని పేర్కొంది.
Similar News
News November 7, 2025
ప్రజలకు నమ్మకం కలిగేలా విధులు నిర్వర్తించండి: ఎస్పీ

పోలీస్ అంటే భయం కాదు.. నమ్మకం కలిగించేలా సిబ్బంది పనిచేయాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లీ పోలీస్ అధికారులను ఆదేశించారు. విధుల నిర్వహణలో ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజలతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. గంజాయి రవాణా, విక్రయాలపై దాడులను నిర్వహించి కఠిన చర్యలు చూసుకోవాలని సూచించారు.
News November 7, 2025
ఫోన్ అడిక్షన్: 25 ఏళ్ల తర్వాత ఇలా ఉంటారట!

ఇటీవల ఫోన్ అడిక్షన్ పెరిగిపోతోంది. రోజంతా రీల్స్ చూస్తూ యువత గడుపుతోంది. ఎటూ కదలకుండా, కేవలం ఫోన్‌లో మునిగిపోయే వారు 2050 నాటికి ఎలా ఉంటారో ఊహిస్తూ స్టెప్ ట్రాకింగ్ యాప్ WeWard ఓ ఫొటో షేర్ చేసింది. వెన్నెముక వంగిపోయి, జుట్టు రాలిపోయి, వృద్ధాప్యం ముందే రావడం, ముఖంపై డార్క్ సర్కిల్స్, ఊబకాయం వంటివి వస్తాయని హెచ్చరించింది. పలు ఆరోగ్య సంస్థల నుంచి సేకరించిన సమాచారంతో ‘Sam’ అనే మోడల్‌ను రూపొందించింది.
News November 7, 2025
టెక్నికల్ సమస్య వల్లే అంతరాయం: రామ్మోహన్

ATCలో సాంకేతిక లోపం వల్లే ఢిల్లీ, ముంబైలో విమానాల రాకపోకలకు <<18227103>>అంతరాయం<<>> ఏర్పడిందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ టెక్నికల్ సమస్య వెనుక బయటి వ్యక్తుల ప్రమేయం లేదని స్పష్టం చేశారు. అయినా లోతైన దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. విమానాలు సకాలంలో నడిచేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూస్తామన్నారు.


