News June 28, 2024

కరోనా క్లిష్టకాలంలోనూ పోలవరం పనులు ఆగలేదు: అంబటి రాంబాబు

image

AP: YCP ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎలాంటి తప్పూ చేయలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. కరోనా క్లిష్టకాలంలోనూ వేగంగా పనులు చేశామన్నారు. 1995 నుంచి 2004 వరకు CMగా ఉండి, కేంద్రంలో చక్రం తిప్పిన CBN పోలవరం గురించి ఎందుకు ఆలోచన చేయలేదని ప్రశ్నించారు. గోదావరి నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నా ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. పోలవరాన్ని YSR ప్రారంభించారని గుర్తు చేశారు.

Similar News

News November 11, 2025

జూబ్లీహిల్స్‌లో BRS గెలుపు: మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్

image

TG: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో BRS పార్టీ గెలుస్తుందని ‘మిషన్ చాణక్య’ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. BRSకు 41.60%, కాంగ్రెస్‌కు 39.43%, BJPకి 18.97% ఓటు షేర్ వస్తుందని పేర్కొంది. షేక్‌పేట్, బోరబండ, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, సోమాజిగూడ డివిజన్లలో BRSకు, యూసుఫ్‌గూడ, రహమత్ నగర్‌ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం వస్తుందని తెలిపింది.

News November 11, 2025

నటి సాలీ కిర్క్‌ల్యాండ్ కన్నుమూత

image

ప్రముఖ హాలీవుడ్ నటి సాలీ కిర్క్‌ల్యాండ్(84) కన్నుమూశారు. డిమెన్షియాతో బాధపడుతున్న ఆమె పలుమార్లు కింద పడటంతోపాటు ప్రాణాంతక ఇన్ఫెక్షన్ల కారణంగా చికిత్స పొందుతూ చనిపోయారు. 1987లో Anna చిత్రానికి గాను ఉత్తమ నటిగా ఆమె ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు. 1968లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాలీ 200కు పైగా చిత్రాలు, టెలివిజన్ సిరీస్‌లలో నటించారు. గోల్డెన్ గ్లోబ్ సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను సాధించారు.

News November 11, 2025

RBIలో ఉద్యోగాలు.. ఫలితాలు విడుదల

image

ఆర్బీఐలో 120 గ్రేడ్-B ఆఫీసర్ పోస్టుల కోసం నిర్వహించిన ఫేజ్-1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. <>https://rbi.org.in/<<>>లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఎంపికైన వారికి డిసెంబర్ 6న ఫేజ్-2 ఎగ్జామ్ జరగనుంది. అందులోనూ సెలక్ట్ అయిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.