News June 28, 2024
ALL TIME RECORD సృష్టించిన కల్కి!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ‘కల్కి’ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. నిన్న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఒక్కరోజులోనే రూ.191.5 కోట్లు (నెట్) వసూలు చేసింది. దీంతో RRR, బాహుబలి-2 తర్వాత ఎక్కువ కలెక్షన్లు వచ్చిన సినిమాగా నిలిచింది. అయితే, నార్త్ అమెరికాలో తొలిరోజు $5.5 మిలియన్ల కలెక్షన్లతో ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్లు కైవసం చేసుకుంది.
Similar News
News December 27, 2025
10 రోజుల్లో ఏ రోజు దర్శించుకున్నా అదే ఫలితం: TTD EO

AP: వైకుంఠ ద్వార దర్శనాలపై భక్తులు ఆందోళన చెందవద్దని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సూచించారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని, ఆ పవిత్ర రోజుల్లో ఏ రోజు స్వామిని దర్శించుకున్నా అదే ఫలితం లభిస్తుందని పండితులు చెప్పారని పేర్కొన్నారు. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో 90% సమయాన్ని సామాన్య భక్తులకే కేటాయించామని వివరించారు.
News December 27, 2025
గర్భనిరోధక మాత్రలు వాడితే పీరియడ్స్ ఆలస్యం అవుతాయా?

గర్భనిరోధక మాత్రల్లో వివిధ రకాల హార్మోన్‌లు, రసాయనాలు ఉంటాయి. ఇవి నేరుగా మీ జీవవ్యవస్థపై పని చేసి మీ ఋతు చక్రంపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. కొందరు స్త్రీలలో తేలికపాటి రక్తస్రావం అవుతుంది. ఈ పిల్స్ ప్రభావం వల్ల మరి కొంతమంది పీరియడ్స్ కొంతకాలం పాటు రాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా వీటిని ఎక్కువగా వాడితే అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు.
News December 27, 2025
పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గడానికి కారణాలు

చలిని తట్టుకోవడానికి పశువులకు ఎక్కువ శక్తి అవసరమవుతుంది. అలాగే ఈ సమయంలో జీవాల్లో జీర్ణప్రక్రియ మందగించడం వల్ల అవి సరిగా గడ్డి, దాణా తీసుకోవు. ఫలితంగా వాటికి కావాల్సిన పోషకాలు అందవు. చలికాలంలో పచ్చిగడ్డి లభ్యత కూడా తగ్గుతుంది. పశువుల్లో ఒత్తిడి (కోల్డ్ స్ట్రెస్) కారణంగా అవి ఆహారం సరిగా తీసుకోవడానికి ఇష్టపడవు. పొదుగువాపు, జ్వరం, నిమోనియా వంటి వ్యాధుల ముప్పు పశువుల పాల ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయి.


