News June 28, 2024

పిన్నెల్లి అరెస్టుతో పల్నాడు ప్రశాంతంగా ఉంది: MLA భాష్యం

image

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుతో పల్నాడులో ప్రశాంత వాతావరణం ఏర్పడిందని పెదకూరపాడు శాసనసభ్యుడు భాష్యం ప్రవీణ్ చెప్పారు. శుక్రవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గడిచిన ఐదేళ్లలో దాడులు, దౌర్జన్యాలకు పల్నాడు జిల్లా కేరాఫ్‌గా మారిందన్నారు. చట్టం నుంచి నేరస్తులు తప్పించుకోలేరని పిన్నెల్లి విషయంలో రుజువైందన్నారు. 14 కేసులలో పిన్నెల్లి దోషిగా ఉన్నారన్నారు.

Similar News

News July 3, 2024

బాపట్ల: సముద్రంలో బోటు బోల్తా.. మత్స్యకారుడి మృతి

image

సముద్రంలో వేటకు వెళ్లి బోటు బోల్తా పడి మత్స్యకారుడు మృతి చెందినట్లు బాపట్ల రూరల్ సీఐ శ్రీహరి తెలిపారు. బాపట్ల మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన కుర్రు కిరణ్ అనే వ్యక్తి సముద్రంలో వేటకు వెళ్లి, అలల తాకిడికి బోటు బోల్తాపడి వలకు చిక్కుకొని మృతి చెందినట్లు మృతుడి తండ్రి తెలిపారన్నారు. మృతుడు తండ్రి అగ్గులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News July 3, 2024

బాపట్ల జిల్లా కలెక్టర్‌గా వెంకట మురళి

image

బాపట్ల జిల్లా కలెక్టర్‌గా వెంకట మురళి నియమితులయ్యారు. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా పనిచేస్తూ బదిలీపై బాపట్ల జిల్లా కలెక్టర్‌గా రానున్నారు. ఇప్పటివరకు బాపట్ల జిల్లా కలెక్టరుగా పని చేసిన రంజిత్ బాష ఇటీవల కర్నూలు జిల్లాకు బదిలీ అయిన విషయం తెలిసిందే. ఇన్‌ఛార్జ్ కలెక్టర్ చామకూరి శ్రీధర్ సైతం అన్నమయ్య జిల్లాకు బదిలీ కావడంతో నూతన కలెక్టర్‌గా వెంకట మురళి రానున్నారు.

News July 2, 2024

కారంపూడి: విద్యార్థులకు లైంగిక వేధింపులు.?

image

కారంపూడి మండలం పెదకోదమగుండ్ల గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో సోషల్ టీచర్‌ ఆరో తరగతి చదువుతున్న విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని తల్లిదండ్రులు హెచ్ఎంకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం గ్రామస్థులతో కలిసి విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్‌పై దాడికి యత్నించారు. దీంతో తల్లిదండ్రులను అడ్డుకుని శాంతింపజేశామని ఉపాధ్యాయులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.