News June 28, 2024

ముంపు గ్రామాల్లో అప్రమత్తం: మంత్రి అనిత

image

వరదల సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గోదావరి ముంపు గ్రామాల్లో ముందస్తు నివారణ చర్యలు చేపట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోం, విపత్తుల నిర్వహణ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. శుక్రవారం అమరావతి నుంచి జిల్లా కలెక్టర్‌తో వరద నివారణ చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దేవీపట్నం మండలంలో వరద నివారణ చర్యలపై ప్రత్యేకంగా కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News July 3, 2024

శతాధిక గిరిజనుడిని ఎత్తుకున్న అల్లూరి కలెక్టర్ దినేష్

image

అల్లూరి కలెక్టర్‌‌గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ దినేష్ కుమార్ మంగళవారం జిల్లాలోని పలు లోతట్టు గ్రామాల్లో పర్యటించారు. ఈ క్రమంలో పెదబయలు అనే గ్రామం వద్ద ప్రజా సమస్యలు చెప్పేందుకు వచ్చిన బాలంనాయుడుకు 100 ఏళ్ల వయసు అని, అతను మాజీ ఎంపీపీ అని తెలిసి సంతోషపడ్డారు. అతనిని ఎత్తుకొని అందర్నీ ఆశ్చర్య పరిచారు. ప్రజా సమస్యల పట్ల నాయుడు శ్రద్ధను కలెక్టర్ మెచ్చుకొని అభినందించారు.

News July 3, 2024

తూర్పుగోదావరి జిల్లాలో 99.05% పెన్షన్లు పంపిణీ పూర్తి

image

తూర్పు గోదావరి జిల్లాలో 99.05% పెన్షన్లు లబ్ధిదారులకు పంపిణీ చేయడం పూర్తయిందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ విషయాన్ని ఆమె మంగళవారం రాత్రి మీడియాకు తెలియజేశారు. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా 2,41,771 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉండగా 2,39,479 మందికి పెన్షన్లను అందించామని స్పష్టం చేశారు.

News July 3, 2024

మొబైల్ యాప్, వెబ్ సైట్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు

image

మొబైల్ యాప్, వెబ్‌సైట్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చునని ఏపీఈపీడీసీఎల్ రాజమండ్రి ఆపరేషన్ సర్కిల్ పర్యవేక్షణ ఇంజినీర్ టీవీఎస్ఎన్ మూర్తి తెలిపారు. రాష్ట్ర తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారులకు ఈ వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఇకపై ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, ఇతర యూపీఐ యాప్‌ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు ఛాన్స్ లేదన్నారు.