News June 28, 2024

విశాఖలో ఆటో డ్రైవర్‌పై దాడి

image

విశాఖ ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నక్కవానిపాలెం ప్రభుత్వ వైన్ షాప్ వద్ద ఆటో డ్రైవర్ బొల్లి అక్కునాయుడుపై దాడి జరిగింది. అయితే ఈ దాడికి పాల్పడిన ముగ్గురు యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. గాయాలైన ఆటో డ్రైవర్‌ను కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో ఎంవీపీ పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

Similar News

News July 3, 2024

విశాఖ పోర్ట్ మొదటి స్థానంలో నిలవడానికి కారణం ఇదే

image

భారత్ నుంచి 132 దేశాలకు సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నట్లు విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ అంగముత్తు తెలిపారు. ఇందులో ప్రధాన దిగుమతిదారులుగా అమెరికా, చైనా నిలిచినట్లు పేర్కొన్నారు. ఎగుమతుల్లో రొయ్యలు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. విశాఖ పోర్ట్ మొదటి స్థానంలో నిలవడానికి ఆక్వా కల్చర్ పరిశ్రమ ప్రధాన కారణమని అన్నారు. వనామీ రొయ్యలు ఎక్కువగా ఎగుమతి చేస్తున్నామని తెలిపారు.

News July 3, 2024

విశాఖ: పలు రైళ్లకు అదనపు బోగీలు జత

image

ప్రయాణికుల సౌకర్యార్థం పలు రైళ్లకు అదనపు బోగీలను జత చేసి నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. విశాఖ-సాయినగర్ శిర్డీ(18503) రైలుకు ఈనెల 4న, సాయినగర్ శిర్డీ-విశాఖ(18504) రైలుకు ఈనెల 5న అదనంగా ఒక జనరల్ బోగీ, అదేవిధంగా విశాఖ-చెన్నై సెంట్రల్(22869) రైలుకు ఈనెల 8న, చెన్నై సెంట్రల్-విశాఖ(22870) రైలుకు ఈనెల 9న అదనంగా ఒక జనరల్ బోగీని జత చేస్తారని పేర్కొన్నారు.

News July 3, 2024

విశాఖ: సీబీసీఎస్సీ స్థలంలో తవ్వకాలపై గనుల శాఖ ఆరా

image

సిరిపురం కూడలి సమీపంలో విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన ఎంవీవీ పీక్ ప్రాజెక్టులో జరిపిన తవ్వకాలపై గనుల శాఖ ఆరా తీసింది. అనుమతులు పొందిన ప్రాంతంలో ప్రత్యేక పరికరాలతో సర్వే నిర్వహించి అనుమతులు పొందిన దాని కంటే ఎక్కువగా తవ్వకాలు జరిపినట్లు తేల్చారు. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని సంబంధిత ప్రాజెక్టు ప్రతినిధులకు నోటీసులు జారీ చేశారు. కాగా కొద్ది నెలల క్రితం పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలో పర్యటించారు.