News June 28, 2024

రేపు ఎవరి కల నెరవేరుతుందో?

image

సౌతాఫ్రికా గత 26 ఏళ్లలో, ఇండియా గత 11 ఏళ్లలో ఒక్క ICC ట్రోఫీ కూడా గెలవలేదు. SA చివరగా 1998లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలవగా, IND 2013లో (CT) టైటిల్ సాధించింది. ఇక SA ఇప్పటివరకు ఒక్క ODI WC, T20 WC కూడా గెలవలేదు. దీంతో ఈసారైనా WC కలను నిజం చేసుకోవాలని ఆ జట్టు ఆశతో ఉంది. భారత్ కూడా మరో WCని తన ఖాతాలో వేసుకోవాలనే అపేక్షతో ఉంది. దీంతో రేపు ఎవరి కల నెరవేరుతుందోనని క్రీడాభిమానులు చర్చించుకుంటున్నారు.

Similar News

News October 11, 2024

సిరాజ్‌కు DSP పోస్ట్

image

TG: టీమ్ ఇండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం కల్పించింది. ఇందుకు సంబంధించిన నియామక పత్రాన్ని డీజీపీ జితేందర్ ఆయనకు అందించారు. కాగా గతంలోనే సిరాజ్‌కు గ్రూప్-1 ఉద్యోగం ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే.

News October 11, 2024

టెన్త్ అర్హతతో 39,481 ఉద్యోగాలు.. మరో 3 రోజులే ఛాన్స్!

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు దరఖాస్తు గడువు సమీపిస్తోంది. 39,481 పోస్టులకు అక్టోబర్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హత: టెన్త్ పాస్ అయి ఉండాలి. పురుషులకు 35,612, మహిళలకు 3869 పోస్టులు ఉన్నాయి. BSF, CISF, CRPF, SSB, ITBP, SSF, ARలో ఉద్యోగాలు భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకోవాల్సిన <>సైట్<<>>: https://ssc.gov.in/

News October 11, 2024

ఈవీఎంలపై చంద్రబాబు కప్పదాటు మాటలు: మేరుగు

image

AP: ఈవీఎంలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్‌పై ఉందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. గతంలో EVMలపై చంద్రబాబే ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు మేం ప్రశ్నిస్తుంటే చంద్రబాబు మాపై కోప్పడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలో ఉన్నప్పుడు ఒకమాట, లేనప్పుడు మరోమాట మాట్లాడుతున్నారన్నారని, సంపన్న దేశాలు సైతం బ్యాలెట్ వైపు మొగ్గు చూపుతున్న విషయాన్ని గమనించాలన్నారు.