News June 28, 2024

BIG BREAKING: డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

TG: డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు CBRT విధానంలో రోజుకు రెండు షిఫ్ట్‌లలో పరీక్షలు జరగనున్నాయి. కాగా మొత్తం 11,062 పోస్టులకు 2,79,966 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. పరీక్షల షెడ్యూల్ కోసం కింది ఆర్టికల్ చూడగలరు.

Similar News

News July 7, 2025

డార్క్ చాక్లెట్‌ తినడం వల్ల లాభాలు!

image

ఈరోజు వరల్డ్ చాక్లెట్ డే. చాక్లెట్లు తింటే ఆరోగ్యం పాడవుతుంది అంటారు. కానీ, డార్క్ చాక్లెట్‌తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
*రక్తపోటు తగ్గి గుండె ఆరోగ్యం మెరుగవుతుంది
*యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా కాపాడతాయి
*జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది
*ఒత్తిడి తగ్గుతుంది
*జీర్ణక్రియ మెరుగవుతుంది
*వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది
*మూడ్ బూస్టర్గా పనిచేస్తుంది

News July 7, 2025

ఆకాశ్ దీప్.. ఆకాశమంత టాలెంట్ అంతే మనస్సు

image

ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో భారత పేసర్ ఆకాశ్ దీప్ పేరు మారుమోగుతోంది. బుమ్రా లేకపోతే ఇంగ్లండ్ చేతిలో 2వ టెస్టులోనూ మనకు ఓటమి తప్పదనుకున్నారంతా. కానీ, ఆకాశ్ 10 వికెట్లు తీసి భారత్‌కు మరుపురాని విజయాన్ని కట్టబెట్టారు. బుమ్రాను మరిపించారు. ఈ ఘనతను క్యాన్సర్‌తో పోరాడుతున్న తన సోదరికి అంకితమిచ్చి హృదయాలు గెలిచారు. గబ్బా‌లో గతంలో ఆకాశ్ గురించి ‌స్మిత్ ఎందుకు పొగిడారో ఈ మ్యాచ్‌తో అందరికీ అర్థమైంది.

News July 7, 2025

గుత్తా జ్వాల కుమార్తెకు పేరు పెట్టిన ఆమిర్ ఖాన్

image

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, నటుడు విష్ణు విశాల్ దంపతుల కుమార్తెకు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ పేరు పెట్టారు. HYD వచ్చి మరీ వారి పాపకు మిరా అని నామకరణం చేశారు. కాగా ‘మిరా అంటే ప్రేమ, శాంతి. ఆమిర్ సర్‌ మీతో ప్రయాణం ప్రత్యేకం. మా పాపకు అద్భుతమైన పేరు పెట్టినందుకు కృతజ్ఞతలు’ అని విశాల్ SMలో పోస్ట్ చేశారు. 2021 ఏప్రిల్ 22న వీరు వివాహం చేసుకోగా వారికి ఈ ఏప్రిల్ 22న పాప పుట్టింది.