News June 28, 2024
ఫైనల్‌లో కోహ్లీ సెంచరీ చేస్తారు: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్

రేపు జరిగే టీ20 WC ఫైనల్‌లో భారత జట్టు గెలుస్తుందని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ అంచనా వేశారు. అలాగే ఫామ్‌లో లేని విరాట్ కోహ్లీ రేపటి మ్యాచులో సెంచరీ చేస్తారని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. టైటిల్ బరిలో నుంచి తమ జట్టు తప్పుకోవడంతో టీమ్‌ఇండియాకు తాను మద్దతునిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ టోర్నీలో విరాట్ ఇప్పటివరకు 75 రన్స్ మాత్రమే చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News January 10, 2026
ఈశాన్యంలో కాకుండా ఆగ్నేయంలో నీరు పడితే?

ఈశాన్యంలో బోరు వేస్తే నీరు పడనప్పుడు నీటి సంపద ఆగ్నేయంలోనూ ఉండవచ్చని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘ఆగ్నేయంలో బోరు వేయడం తప్పు కాదు. నీరు లభించడమే అదృష్టంగా భావించాలి. అయితే ఆగ్నేయ బోరు వల్ల కలిగే దోష నివారణకు ఈశాన్యంలో ఓ ఇంకుడు గుంత నీటి నిల్వ తొట్టి నిర్మించాలి. దాన్నెప్పుడూ నీటితో ఉంచాలి. ఇంకుడు గుంత ఏర్పాటుతో భూగర్భ జలాలను కాపాడి వాస్తు సమతుల్యత పాటించవచ్చు’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 10, 2026
కేంద్రం ముందు ఏపీ మంత్రి బడ్జెట్ ప్రతిపాదనలు!

కేంద్ర బడ్జెట్‌లో APకి ప్రాధాన్యం ఇవ్వాలని ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కోరారు. రాజధాని నిర్మాణం, నదుల అనుసంధానం, రాయలసీమ ప్రాంతీయ సమగ్రాభివృద్ధి, సాస్కీ, పూర్వోదయ పథకాలకు నిధులు, వైజాగ్ ఆర్థిక ప్రాంతీయాభివృద్ధికి ₹5వేల కోట్ల కేటాయింపు, పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్యాకేజ్ ఇవ్వాలంటూ ప్రతిపాదనలు చేశారు.
News January 10, 2026
రికార్డు సృష్టించిన జెమీమా

WPLలో యంగెస్ట్ కెప్టెన్‌గా జెమీమా రోడ్రిగ్స్(25y 127days) రికార్డు సృష్టించారు. ఈ సీజన్‌లో ఆమె ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. జెమీమా తర్వాతి స్థానంలో స్మృతి మంధాన(26y 230days-2023) ఉన్నారు. కాగా ఇవాళ ముంబైతో జరుగుతున్న మ్యాచులో ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.


