News June 29, 2024

శ్రీలంకలో 137 మంది భారతీయుల అరెస్ట్

image

సైబర్ స్కామ్‌కు పాల్డడ్డారనే ఆరోపణలతో 137 మంది భారతీయులను శ్రీలంక అరెస్ట్ చేసింది. కొలంబోలోని మడివేలా, బత్తరముల్లా, నెగొంబా ప్రాంతాల్లో వీరందరిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరు బెట్టింగ్, జూదం, ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దుబాయ్, అఫ్గానిస్థాన్‌లోనూ వీరు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు గుర్తించారు.

Similar News

News August 31, 2025

పూర్తి నీరు నిల్వ చేసినందుకే మేడిగడ్డ కూలింది: ఉత్తమ్

image

TG: KCR అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని మంత్రి ఉత్తమ్ అసెంబ్లీలో విమర్శించారు. ‘డ్యామ్‌కు, బ్యారేజీకి తేడా లేకుండా పనులు చేశారని NDSA నివేదికలో ఉంది. మేడిగడ్డలో పూర్తి నీరు నిల్వ చేసి కూలిపోయేందుకు కారణమయ్యారు. పూర్ ప్లానింగ్, డిజైన్ వల్లే అది కూలిందని NDSF తేల్చి చెప్పారు. మీరే డిజైన్ చేశారు. మీరే కట్టారు. మీ హయాంలోనే కూలింది. ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్’ అని ఫైరయ్యారు.

News August 31, 2025

IPL: ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త కెప్టెన్?

image

ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ వచ్చే సీజన్‌కు కొత్త కెప్టెన్‌ను నియమించనున్నట్లు వార్తలొస్తున్నాయి. గత సీజన్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన అక్షర్ పటేల్‌ను కేవలం ఆటగాడిగా కొనసాగించనున్నట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వార్నర్, KL రాహుల్ వంటి ప్లేయర్లు కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు సమాచారం. గత సీజన్‌లో DC పాయింట్స్ టేబుల్‌లో ఐదో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

News August 31, 2025

కాళేశ్వరంతో ఐదేళ్లలో వాడుకుంది 101 టీఎంసీలే: ఉత్తమ్

image

TG: రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును కడితే ఐదేళ్లలో 101 టీఎంసీలు మాత్రమే వాడుకున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. ‘సంవత్సరానికి 195 TMCలు లిఫ్ట్ చేస్తామని చెప్పారు. 2019లో ప్రారంభమైనప్పటి నుంచి 2023 OCT వరకు ఐదేళ్లలో 162 TMCలే ఎత్తిపోశారు. ఇందులో 32 TMCలు సముద్రంలోకి వదిలిపెట్టారు. ఆవిరి పోనూ ఐదేళ్లలో 101 TMCలే వాడుకున్నారు. అంటే ఏడాదికి 20.2 TMCలే’ అని విమర్శించారు.