News June 29, 2024

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఘటన: కేంద్రం కీలక ఆదేశాలు

image

ఢిల్లీ విమానాశ్రయం ఘటన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిర్‌పోర్టుల నిర్మాణాలను తనిఖీ చేయాలని భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ఆదేశించింది. ఇందుకు సంబంధించిన నివేదికను 2 నుంచి 5 రోజుల్లో సమర్పించాలని పేర్కొంది. కాగా ఇవాళ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్-1 రూఫ్ కూలి ఒకరు మరణించగా, ఆరుగురు గాయపడిన సంగతి తెలిసిందే.

Similar News

News July 3, 2024

121కి చేరిన మరణాలు.. భోలే బాబా పరార్

image

యూపీలోని హాథ్రస్‌లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 121కి చేరింది. నిన్న 116 మంది మరణించగా చికిత్స పొందుతూ ఈరోజు మరో ఐదుగురు ప్రాణాలు విడిచారు. ఇదిలా ఉంటే అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు చేసిన భోలే బాబా పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. బాబాకు సంబంధించిన రామ్ కుటీర్ ఛారిటబుల్ ట్రస్టులో వెతికినా ఆయన కనిపించలేదని తెలిపారు.

News July 3, 2024

నేడు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు

image

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో రాయలసీమతో పాటు ఉమ్మడి శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం, తూ.గో., ప.గో., కృష్ణా తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తెలంగాణలో ద్రోణి ప్రభావంతో ఇవాళ, రేపు అక్కడక్కడ తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. ఎల్లుండి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది.

News July 3, 2024

రేపు స్వదేశానికి భారత జట్టు!

image

హరికేన్ కారణంగా బార్బడోస్‌లోనే చిక్కుకుపోయిన భారత జట్టు మరికొన్ని గంటల్లో స్వదేశానికి బయలుదేరనుంది. ఆటగాళ్లు, సిబ్బంది కోసం BCCI ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసినట్లు జాతీయ మీడియా ప్రతినిధులు వెల్లడించారు. వీరితో 20మందికిపైగా మీడియా సిబ్బంది వచ్చేందుకు BCCI సెక్రటరీ జైషా అనుమతించారని చెప్పారు. ఈ క్రమంలో మీడియా వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాగా రేపు ఉదయం కల్లా విమానం ఢిల్లీ చేరే అవకాశముంది.