News June 29, 2024

రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి క్లయిమ్ సెటిల్మెంట్ కమిటీ, రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలన్నారు.

Similar News

News July 3, 2024

అనంత: బాలికపై అత్యాచారం..

image

ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను యువకుడు అత్యాచారం చేసిన ఘటన పుట్లూరు మండలంలో జరిగింది. ఇంటర్ చదువుతున్న బాలికను ఈ నెల 23న ఇంటి వద్ద నుంచి రవితేజ బైక్‌పై బలవంతంగా తీసుకెళ్లాడు. ఐషర్ వాహనంలో రాత్రంతా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఉదయం బాలిక తప్పించుకుని ఇంటికి చేరుకుంది. షాక్‌లో ఉన్న బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పలేదు. బంధువులు ధైర్యం చెప్పి ఆరా తీయగా విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News July 3, 2024

అనంత: రానున్న 5 రోజుల్లో తేలికపాటి వర్షాలు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు విజయ్ శంకర్, నారాయణ స్వామి తెలిపారు. వచ్చే ఐదు రోజులు ఉష్ణోగ్రతలు పగటి వేళ 35.5 డిగ్రీల నుంచి 36.6 డిగ్రీలుగా, రాత్రి వేళ 25.6 డిగ్రీల నుంచి 26.2 డిగ్రీలుగా నమోదయ్యే సూచనలు ఉన్నాయన్నారు. నైరుతి దిశగా గాలులు గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

News July 3, 2024

హెల్మెట్ లేకుంటే కేసు నమోదు చేయండి: ఎస్పీ మాధవరెడ్డి

image

ద్విచక్ర వాహన ప్రయాణికులు హెల్మెట్ కచ్చితంగా ధరించాలని, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసే వారిపై కేసులు నమోదు చేయాలని సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో రహదారి ప్రమాదాల నివారణపై అధికారులతో ఎస్పీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసి వారికి జైలు శిక్ష పడేటట్లు చేయాలన్నారు.