News June 29, 2024
CTR: మామిడి రైతులకు సూచనలు

ఇంకా మామిడి కాయలు కోయకుండా ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాలని బంగారుపాలెం ఉద్యాన శాఖ అధికారిణి సాగరిక సూచించారు. పండు ఈగతో నష్టం జరగకుండా బుట్టలను ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎకరాకు 6 నుంచి 8 పండు ఈగ బుట్టలను పెట్టుకోవాలని సూచించారు. బుట్టలోని చెక్క ముక్క పైన ఏదైనా పురుగుమందు 4 నుంచి 5 చుక్కలు వేసుకోవాలని కోరారు.
Similar News
News February 13, 2026
హైవేలపై ప్రాణాలు పోతున్నాయ్: MLA

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న ప్రమాదాల్లో ఏడాదికి 400 మంది వరకు చనిపోతున్నారని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ చెప్పారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘జగమర్ల నుంచి నేండ్రగుంట వరకు ఉన్న హైవేపై ఎక్కడ ప్రమాదం జరిగినా తిరుపతి రుయా లేదా వేలూరు ఆసుపత్రికి తరలించాలి. ఈలోపు ప్రాణాలు పోతున్నాయి. పి.కొత్తకోట వద్ద 50 బెడ్లతో ట్రామాకేర్ ఏర్పాటు చేయాలి’ అని MLA కోరారు.
News February 13, 2026
ఆ పథకాన్ని ఏపీలోనూ అమలు చేయాలి: చిత్తూరు MP

రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకాన్ని ఏపీలో అమలు చేయాలని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు కోరారు. ప్రస్తుతం చంఢీగఢ్, అస్సాం, పంజాబ్, ఉత్తరఖండ్, హర్యానా, పుదుచ్చేరిలో అమలులో ఉన్న ఈ పథకాన్ని ఏపీలోనూ అమలు చేసి బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. దీనికి కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించినట్టు ఆయన పేర్కొన్నారు.
News February 12, 2026
చిత్తూరు: YCP కమిటీ నియామకాల విడుదల

చిత్తూరు జిల్లా వైసీపీ అనుబంధ విభాగాల కమిటీ నియామకాలు జరిగాయి. ఇందులో భాగంగా పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి వివరాలు విడుదల చేశారు. డిస్ట్రిక్ట్ యూత్ వింగ్ సెక్రటరీగా పుంగనూరు కమతంపల్లికి చెందిన కొమ్మిరి కుమార్, డిస్ట్రిక్ట్ పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా ఈశ్వర్ నియమితులయ్యారు. గ్రామస్థాయి నుంచి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు.


