News June 29, 2024
బద్వేల్: ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ

ఎర్రచందనం అక్రమ రవాణాలో సంబంధం ఉన్నటువంటి ఇద్దరు కానిస్టేబుళ్లను శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ సస్పెండ్ చేశారు. ఇటీవల పట్టుబడిన ఎర్ర చందనం కేసులో బద్వేలు అర్బన్ స్టేషన్ కానిస్టేబుల్ సుధాకర్, అట్లూరు స్టేషన్ కానిస్టేబుల్ రామకృష్ణ ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలో సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News January 13, 2026
పులివెందుల హత్యాయత్నం కేసులో ఇద్దరికి జైలు శిక్ష

పులివెందుల అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండున్నర సంవత్సరాల కిందట జరిగిన హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులకు 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ కడప అదనపు సెషన్స్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఫిర్యాదిదారుడిపై కత్తితో దాడి చేసినట్టు నేరం రుజువుకావడంతో ఈ శిక్ష విధించారు. ఈ కేసులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలాజీతో పాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
News January 13, 2026
మూడవరోజు గండికోట ఉత్సవాల షెడ్యూల్ ఇదే..!

* ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు అడ్వెంచర్ యాక్టివిటీస్-హెలిరైడ్, పారామోటార్ గ్లైడింగ్
* సాయంత్రం 4-7 వరకు కవిత్వం, కథ చెప్పడం, ఫోటోగ్రఫీ, స్కెచింగ్, పెయింటింగ్, లాగింగ్, వంటల పోటీలు
* సాయంత్రం 7 గంటలకు మిమిక్రి, జానపద గేయాలు, చెక్క భజన, క్లాసికల్ డాన్స్, యక్ష గానం, బృందావనం-సౌండ్, లైట్&లేజర్ షో
* 7:20-9 వరకు శివమణి మ్యూజికల్ నైట్
* రాత్రి 9లకు ఫైర్ వర్క్స్
*9:30కి ఉత్సవాల ముగింపు
News January 12, 2026
వీఎన్ పల్లె తహశీల్దార్‌కు షోకాజ్ నోటీసులు

పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం వహించిన వీఎన్ పల్లె తహశీల్దార్ లక్ష్మీదేవితో పాటు మరో 11 మందికి జిల్లా కలెక్టర్ శ్రీధర్ సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9వ తేదీలోగా గ్రామసభల ద్వారా రైతులకు పుస్తకాలు అందజేయాలని ఆదేశించినా అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.


