News June 29, 2024

విశాఖ: డ్రెడ్జ్-8 నౌకకు అత్యవసర మరామత్తులు పూర్తి

image

విశాఖలో హిందుస్థాన్ షిప్ యార్డ్‌లో కేవలం ఐదు రోజుల్లోనే అత్యవసర డ్రై డాకింగ్ పనులను విజయవంతంగా పూర్తి చేసింది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన డ్రెడ్జ్-8 నౌక అత్యవసర మరమ్మతుల కోసం ఈనెల 21న తీసుకువచ్చారు. సంస్థ అధికారులు, సిబ్బంది 24 గంటల ప్రణాళికతో ఐదు రోజుల్లో పనులు పూర్తి చేశారు. ఈ నౌకను 1977లో నిర్మించినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News July 3, 2024

జీతాల కోసం ఏయూ ఉద్యోగుల ఎదురుచూపులు..!

image

జీతాల కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. మూడో తేదీ వచ్చినా ఉద్యోగులకు ఖాతాల్లో ఇంకా జీతాలు పడలేదు. ప్రతినెలా ఉద్యోగుల జీతాలకు దాదాపు రూ.36 కోట్లు వరకు ఖర్చవుతుంది. దీనికి సంబంధించిన ఫైల్‌పై స్వయంగా వీసీ సంతకం పెట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఏయూ వీసీ తన పదవికి రాజీనామా చేయగా, కొత్తవారిని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నియమించలేదు. ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌‌తో పాలన సాగుతోంది.

News July 3, 2024

విశాఖలో ఉల్లి కోసం క్యూ

image

రైతు బజార్‌లో ఉల్లిపాయలు కొనుగోలు చేయడానికి వినియోగదారులు క్యూ కడుతున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు టమాటాకు భారీగా డిమాండ్ ఏర్పడడం వల్ల 80 రూపాయల వరకు ధర పలికింది, దీంతో వినియోగదారులు క్యూ కట్టారు. తాజాగా ఉల్లిపాయల ధర కేజీ రూ.36కు చేరుకుంది. రైతు బజార్‌లో తగినంత సరుకు కూడా లేకపోవడంతో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో వినియోగదారులు క్యూలో నిల్చొని ఉల్లిపాయలు కొనుగోలు చేస్తున్నారు.

News July 3, 2024

భారత్-బంగ్లాదేశ్ స్నేహబంధం బలోపేతం

image

భారత్- బంగ్లాదేశ్ నౌకా దళాల మధ్య జరుగుతున్న విన్యాసాలతో రెండు దేశాల మధ్య స్నేహబంధం బలోపేతం కానుందని మంగళవారం విశాఖలో నేవీ అధికారులు తెలిపారు. భారత్ తరఫున హాజరైన ‘ఐఎన్ఎస్ రణవీర్’ యుద్ధనౌక కమాండింగ్ అధికారి(సీవో)కి బంగ్లాదేశ్ నేవీ అధికారులు రియర్ అడ్మిరల్ ఖొండ్కర్ మిస్బా ఉల్ అజీమ్, రియర్ అడ్మిరల్ ఎస్. ఎం. మోనిరుజ్జామన్లు వేర్వేరు జ్ఞాపికలు అందించారు.