News June 29, 2024

రామతీర్థంలో క్రీస్తు శకం మూడవ శతాబ్ది బౌద్ధ ఆనవాళ్లు

image

చీమకుర్తి మండలం రామతీర్థంలోని మోక్ష రామలింగేశ్వరాలయంలో క్రీస్తు శకం మూడవ శతాబ్దం నాటి బౌద్ధఆనవాళ్లను గుర్తించినట్లు పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. ఇటీవల రామతీర్థం ఆలయ పరిసరాల్లో జరిపిన అన్వేషణలో ఆలయం వెనుక వైపు నిర్లక్ష్యంగా పడి ఉన్న శివలింగాల మధ్య పలనాటి సున్నపు రాతి బౌద్ధ స్తంభాన్ని దానిపైన అర్ధచంద్రాకార పద్మాన్ని గుర్తించినట్లు ఆయన చెప్పారు.

Similar News

News July 3, 2024

ప్రకాశం: ప్రేమ పేరుతో మోసం.. యువకుడి అరెస్టు

image

ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఓ యువకుడిపై కేసు నమోదు చేసినట్లు హనుమంతునిపాడు ఎస్సై తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన అవినాశ్ కొంతకాలంగా బంధువుల అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఆమెకు మాయ మాటలు చెప్పి శారీరకంగా దగ్గరవడంతో గర్భం దాల్చింది. పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో అతను తప్పించుకు తిరుగుతున్నాడు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించామన్నారు.

News July 3, 2024

శానంపూడి ఎంఎల్‌హెచ్‌పీ ఆత్మహత్య

image

శృంగవరపు కోట మండలం శానంపూడి హెల్త్‌ సెంటర్‌లో ఎంఎల్‌హెచ్‌పీగా పనిచేస్తున్న రమావంత్‌ రవినాయక్‌ (33) ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రైలు పట్టాలపై రవినాయక్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఆదివారం ఆయన స్కూటీపై వచ్చి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉందని వారు వెల్లడించారు. పోలీసులు సంఘటనా స్థలం సమీపంలో స్కూటీని గుర్తించారు.

News July 3, 2024

ప్రకాశం: భర్తను హత్య చేయించిన భార్య.. ఎందుకంటే?

image

రాచర్ల మండలం రామాపురం గ్రామంలో జూన్ 29వ తేదీన ఓ వ్యక్తిని హతమార్చిన కేసులో ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్లుగా డీఎస్పీ బాలసుందరావు మంగళవారం వెల్లడించారు. పొలం పంపకం విషయంలో సొంత భార్య రాజేశ్వరి భర్త స్నేహితుడితో కలిసి భర్తను హత్య చేయించింది. విచారణలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయని డీఎస్పీ బాలసుందరావు తెలిపారు.