News June 29, 2024

ఫలితాలు చూసి హిమాలయాలకు వెళ్లాలనుకున్న జగన్?

image

AP: ఎన్నికల ఫలితాలు చూసి హిమాలయాలకు వెళ్లాలనిపించిందని పార్టీ నేతలతో మాజీ CM జగన్ అన్నట్లు తెలిసింది. కానీ 40% ఓట్లు చూసి ఆగిపోయానని వారితో చెప్పినట్లు సమాచారం. ‘ఫలితాల షాక్‌లోంచి బయటకు రావడానికి నాకు 2, 3 రోజులు పట్టింది. 40 శాతం ఓట్లు అంటే పెద్ద సంఖ్యలో జనం మన వెంటే ఉన్నారు. వారి కోసమైనా నిలబడాలి అనుకున్నా. అందుకే మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యా’ అని అన్నట్లు వార్తలొస్తున్నాయి.

Similar News

News July 3, 2024

టీషర్ట్‌, టోన్డ్ జీన్స్‌తో కాలేజీకి రావొద్దు!

image

టీషర్ట్‌, టోన్డ్ జీన్స్‌ కాలేజీకి రావొద్దని ముంబైలోని చెంబూర్‌ ట్రాంబే ఎడ్యుకేషనల్‌ సొసైటీ విద్యార్థులకు హుకుం జారీ చేసింది. విద్యార్థులు సాంస్కృతిక అసమానతల్ని సూచించే దుస్తులతో వస్తే అనుమతించమని స్పష్టం చేసింది. గతనెలలో ఇదే సొసైటీ కళాశాల ప్రాంగణంలో హిజాబ్‌, బుర్ఖా, నకాబ్‌, టోపీలపై నిషేధం విధించింది. దానిపై పలువురు విద్యార్థులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. నిషేధాన్ని హైకోర్టు సైతం సమర్థించింది.

News July 3, 2024

DSC అభ్యర్థులకు BIG ALERT

image

AP: ఎన్నికలకు ముందు ప్రకటించిన DSCకి దరఖాస్తు చేసిన వారు మెగా DSCకి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి లోకేశ్ వెల్లడించారు. మెగా DSC, TETకు మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తులు పరిశీలించాలని అధికారులకు మంత్రి సూచించారు. వయోపరిమితి సడలింపుపై తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొన్ని జిల్లాల్లో న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టులు భర్తీ చేయాలని ఆయన ఆదేశించారు.

News July 3, 2024

రోహిత్‌కి బాల్ విసిరేద్దామనుకున్నా: సూర్య

image

T20WC ఫైనల్‌లో తాను అందుకున్నది క్లీన్ క్యాచ్‌ అని సూర్య కుమార్ స్పష్టం చేశారు. ‘సాధారణంగా రోహిత్ భాయ్ లాంగాన్‌లో ఫీల్డింగ్ చేయరు. కానీ అప్పుడు చేశారు. మిల్లర్ క్యాచ్ రోహిత్ తీసుకుంటారేమోనని ఒక్క క్షణం ఆయన వైపు చూశా. ఆయనా నా వైపు చూశారు. నేను పరిగెత్తుకెళ్లి క్యాచ్ అందుకున్నా. రోహిత్ నాకు దగ్గర్లో ఉంటే బంతిని అతడికి విసిరేద్దామనుకున్నా. కానీ సమీపంలో లేక నేనే మళ్లీ అందుకున్నా’ అని SKY చెప్పారు.