News June 29, 2024

‘RRR’కు రూట్ క్లియర్!

image

TG: రీజినల్ రింగ్ రోడ్డు(RRR) నిర్మాణానికి అడ్డంకులు తొలగుతున్నాయి. ఒకేసారి ఉత్తర, దక్షిణ భాగాల(350.76KM) పనులు చేపట్టడమే ఉత్తమమన్న కేంద్రమంత్రి గడ్కరీ సూచనకు CM రేవంత్ అంగీకరించారు. దీంతో భూసేకరణ ప్రక్రియ ఊపందుకోనుంది. నిర్మాణంలో భాగంగా తీగలు, స్తంభాలు, పైప్‌లైన్ల తరలింపు కోసం కేంద్రమే రూ.300Cr ఇస్తుందని మంత్రి చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. గతంలో ఇదేవిషయమై సందిగ్ధత నెలకొంది.

Similar News

News July 3, 2024

విద్యార్థులకు గుడ్‌న్యూస్

image

TG: రాష్ట్రంలోని ప్రతి స్కూలుకు ఇంటరాక్టివ్ వైట్ బోర్డులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు పాఠశాల విద్యార్థులకు 20వేల ల్యాప్‌టాప్‌లు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనిపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, నోకియా సంస్థ ప్రతినిధులతో సీఎం చర్చించారు. ల్యాప్‌టాప్‌లు ఏ క్లాస్ నుంచి అందించాలనే అంశాన్ని త్వరలోనే ప్రకటించనున్నారు.

News July 3, 2024

ఫొటో తీసి రూ.20వేలు గెలిచే ఛాన్స్!

image

AUG19న వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తోంది. మహాలక్ష్మీ, రైతు భరోసా, చేయూత, గృహజ్యోతి వంటి పథకాలతో పాటు ఉత్తమ వార్తా చిత్రం(న్యూస్ క్లిప్) విభాగాల్లో ఫొటోలు తీయాలి. మొదటి ముగ్గురికి రూ.20వేలు, రూ.15వేలు, రూ.10వేలు, తర్వాత ఐదుగురికి ప్రోత్సాహకంగా రూ.5వేలు ఇస్తుంది. ఫొటోలను adphoto.ts@gmail.coకి పంపాలి. మరిన్ని వివరాలకు 9949351523కి ఫోన్ చేయవచ్చు.

News July 3, 2024

రాహుల్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాలి: మోదీ

image

అగ్నివీర్, మైనార్టీ తదితర అంశాలను రాహుల్ గాంధీ తెరపైకి తెచ్చి లోక్‌సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. రాహుల్ వ్యాఖ్యలను పిల్లల ప్రవర్తన అని చెప్పి తేలికగా తీసుకోవద్దని స్పీకర్ ఓం బిర్లాను కోరాను. హిందువులను ఎగతాళి చేయడం ఫ్యాషన్‌గా మారిపోయిందన్నారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీకి సీనియర్ నేతలున్నా అరాచక, అబద్ధాల మార్గంలో వెళ్లాలనుకోవడం ఆందోళనకరమన్నారు.