News June 29, 2024
టీ20 WC చరిత్రలో ఒక్కసారీ అలా జరగలేదు!

టీ20 WC చరిత్రలో ఇప్పటివరకూ ఫైనల్ ఆడిన జట్లు మరోసారి ఫైనల్‌లో తలపడలేదు. ప్రతీ ఎడిషన్‌లో కొత్త ప్రత్యర్థులే ఎదురుపడ్డారు. భారత్VSపాక్ (2007), పాక్VSశ్రీలంక (2009), ఇంగ్లండ్VSఆసీస్ (2010), వెస్టిండీస్VSశ్రీలంక (2012), శ్రీలంకVSభారత్ (2014), వెస్టిండీస్VSఇంగ్లండ్ (2016), ఆస్ట్రేలియాVSన్యూజిలాండ్ (2021), ఇంగ్లండ్VSపాక్(2022), సౌతాఫ్రికాVSఇండియా (2024) ఫైనల్ చేరాయి.
Similar News
News January 1, 2026
భారత్ అందరిదీ.. RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు

డెహ్రాడూన్‌లో త్రిపుర విద్యార్థిపై జరిగిన జాతివివక్ష దాడి నేపథ్యంలో RSS చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘భారతదేశం అందరిది. కులమతాలు, భాష, ప్రాంతం ఆధారంగా ఎవరినీ తక్కువ చేయొద్దు’ అని ఆయన పిలుపునిచ్చారు. విభజన భావాలను వీడి సమానత్వంతో మెలగాలని ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన సభలో సూచించారు. దాడిలో చనిపోయిన విద్యార్థి ఏంజల్ చక్మా మృతి పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ సామాజిక సామరస్యం అవసరమని గుర్తుచేశారు.
News January 1, 2026
అనుకున్న సమయానికి అమరావతి పూర్తి చేస్తాం: నారాయణ

AP: అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అనుకున్న సమయానికే రాజధానిని పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. మూడేళ్లలో పూర్తిస్థాయిలో అమరావతి రూపుదిద్దుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే CM చంద్రబాబు అనేక పెట్టుబడులను తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.
News January 1, 2026
గుండెలు పగిలే బాధ.. ఈ తల్లి శోకాన్ని తీర్చేదెవరు?

ఇండోర్ (MP)లో <<18729199>>కలుషిత నీరు<<>> తాగి చనిపోయిన వారిలో 6 నెలల పసికందు కూడా ఉండటం హృదయాలను కలచివేస్తోంది. తల్లి సాధన మున్సిపల్ కుళాయి నీటిని పాలలో కలిపి బిడ్డకు తాగించింది. వాంతులు చేసుకున్న కుమారుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పదేళ్ల ప్రార్థనల తర్వాత సంతానం కలిగిందని, పెద్ద కూతురు (10) కడుపునొప్పితో బాధపడుతోందని ఆ తల్లి గుండెలు బాదుకుంది.


